P Krishna
Telangana Farmers: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా రైతులకు మరో శుభవార్త అందించింది తెలంగాణ సర్కార్.
Telangana Farmers: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా రైతులకు మరో శుభవార్త అందించింది తెలంగాణ సర్కార్.
P Krishna
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సీఎం గా రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ తనదైన మార్క్ చాటుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తు వస్తున్నారు. ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తు స్వీకరణకు ‘ప్రజా పాలన’ అనే కార్యక్రమం ఏర్పాటు చేశారు. రైతు సంక్షేమం గురించి వివిధ పథకాలు అమల్లోకి తీసుకు వస్తున్నారు. ఆగస్టు 15 వరకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల వర్షాలకు పంట నష్టపోయిన వారికి పరిహారం చెల్లించారు. చొప్పన తాజాగా తెలంగాణ రైతులకు మరో శుభవార్త. వివరాల్లోకి వెళితే..
ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలు రైతులకు తీవ్ర పంట నష్టాన్ని కలిగించాయి. తాజాగా అకాల వర్షాల వల్ల రైతులకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. మంగళవారం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. ధాన్యం కనుగోలు కేంద్రాల్లో ఎలాంటి జాప్యం జరగకుండా చూస్తామని తెలిపారు. ధాన్యం సేకరించి రైతుల ఖాతాల్లో వెంటనే డబ్బులు జమచేస్తామన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నారని భట్టి సీరియస్ అయ్యారు. నేటి యువత సాంకేతిక రంగంలో అప్డేట్ కావాలి.. వాతావరణ శాఖ సూచనలపై రైతులకు వివరించాలని సూచించారు.
తెలంగాణ ప్రజలకు వర్ష సూచన ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నాం. 15 రోజుల ముందే ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. గతంలో కంటే ఎక్కువగా 7,215 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం. గత ప్రభుత్వం కన్నా ఎక్కువగా ధాన్యం కొంటున్నామని భట్టి తెలిపారు. గత ప్రభుత్వం తడిచినా, మొలకెత్తినా ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు.. మా ప్రభుత్వం అలా కాదు అలాంటి ధాన్యాన్ని కూడా కొంటామన్నారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం.. రైతులు ఈ విషయంలో గుండెమీద చేయి వేసుకొని ప్రశాంతంగా ఉండాలని అన్నారు. రైతులు ఆందోళన చేయవొద్దు..బీఆర్ఎస్ నేతల మాటలకు మోసపోద్దు అని అన్నారు.