iDreamPost
android-app
ios-app

తవ్వకాల్లో బయటపడ్డ లంకె బిందెలు! ఏకంగా 3700 నాణేలు లభ్యం!

ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయిన భారత సంపద ఒక్కొక్కటిగా తవ్వకాల్లో బయటపడుతోంది. తాజాగా ఓ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో భారీ ఎత్తున నాణెలు లభించాయి.

ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయిన భారత సంపద ఒక్కొక్కటిగా తవ్వకాల్లో బయటపడుతోంది. తాజాగా ఓ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో భారీ ఎత్తున నాణెలు లభించాయి.

తవ్వకాల్లో బయటపడ్డ లంకె బిందెలు! ఏకంగా 3700 నాణేలు లభ్యం!

ఎప్పుడో పూర్వీకులు భూమిలో దాచిపెట్టిన లేదా కాలగర్భంలో కలిసిపోయిన అరుదైన విగ్రహాలు, నాణెలు ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి తవ్వకాల్లో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పొలాల్లో దున్నతున్న సమయంలో, పాత బడిన ఇళ్ల నిర్మాణం జరుగుతున్నప్పుడు లేదా పురావస్తు శాఖ చేపట్టిన తవ్వకాల్లో బౌద్దుని విగ్రహాలు, లంకె బిందలు దొరికిన ఘటనలు చూశాం. తాజాగా తెలంగాణలో లంకె బిందెను పోలిన కుండలు బయటకు వచ్చాయి. తీసి చూస్తే వాటి నిండా నాణెలున్నాయి. అవన్నీ సీసపు నాణెలుగా గుర్తించింది పురావస్తు శాఖ. పురాతన చరిత్ర, ఆధారాలను వెలికి తీసేందుకు పురావస్తు శాఖ తవ్వకాలు జరుపుతుంది.

ఈ క్రమంలో నల్గొండ జిల్లా తిరుమల గిరి మండలం ఫణిగిరిలో తవ్వకాలు చేపట్టింది. వెంటనే కుండలు కనిపించాయి. వాటి నిండా నాణెలు బయట పడ్డాయి. అది 2 వేల ఏళ్ల నాటి నాణెలుగా తెలుస్తోంది. మొత్తం 3,700 సీసపు నాణెలను పురావస్తు శాఖ వెలికి తీసింది. ఇవన్నీ కూడా భద్ర పరచనుంది పురావస్తు శాఖ. 2015లో కూడా ఇదే గ్రామంలో తవ్వకాలు చేపట్టగా.. ఓ పురాతన బౌద్ద అవశేషాలను సేకరించింది. రెండు వేల ఏళ్ల నాటి అవశేషాలు కావడంతో ఫణిగిరి క్రీపూ 3వ శతాబ్దం నుండి క్రీ శ 3వ శతాబ్దం వరకు బౌద్ద మతానికి సంబంధించిన ప్రధాన ప్రాంతంగా బాసిల్లి ఉంటుందని భావిస్తున్నారు అధికారులు. అక్కడి కొండపై 16 ఎకరాల విస్తీర్ణంలో బౌద్ద స్తూపం కూడా ఉంది.

తెలంగాణలో వివిధ పురావస్తు స్థలాల్లో జరిపిన తవ్వకాల్లో ఎక్కువగా ఇక్ష్వాకుల నాటి శిల్పాలు దొరుకుతున్నాయట. ఇలా దొరికిన ప్రతీ రాతి ముక్క ఒక విలువైనదే అని చెబుతారు అధికారులు.  ఫణిగిరి తవ్వకాల్లో గతంలో ఓ అరుదైన బౌద్ద స్తూపం దొరికిందని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో స్వాతంత్య్రానికి పూర్వం నుండే తవ్వకాలు జరుగుతున్నాయి.  1941లో అప్పటి నిజాం సర్కార్‌ కూడా ఫణిగిరిలో తొలుత తవ్వకాలు జరిపింది. ఆ సమయంలో బౌద్ధ ఆధారాలు కనుగొన్నారు. 2001–2007 మధ్య, తిరిగి 2018–19 మధ్య ఇక్కడ జరిపిన తవ్వకాల్లో అనేక అవశేషాలు గుర్తించారు. తాజాగా ఈ నెల 31న జరిపిన తవ్వకాల్లో నాణేలు, తోరణాలు, శాసనాలు, వ్యాసాలు, లిఖిత పూర్వక స్తంభాలు లభించాయి.