మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడి కాలేజీలో కూల్చివేతలు

మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబానికి అధికారులు షాకిచ్చారు. ఆయన అల్లుడికి చెందిన కాలేజీలో కూల్చివేతలు ప్రారంభించారు. చెరువును కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారన్న ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు చర్యలు చేపట్టారు.

మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబానికి అధికారులు షాకిచ్చారు. ఆయన అల్లుడికి చెందిన కాలేజీలో కూల్చివేతలు ప్రారంభించారు. చెరువును కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారన్న ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు చర్యలు చేపట్టారు.

చట్టాలు ఎవరికీ చుట్టాలు కావు. తప్పు చేస్తే ఎంతటి వ్యక్తులైనా చట్టం ముందు తల వంచాల్సిందే. సమాజంలో బాధ్యతగల పదవుల్లో ఉండి అందరికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎప్పటికైన అక్రమార్కుల పాపం పండాల్సిందే. చేసిన తప్పులకు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇదే రీతిలో తెలంగాణలో మాజీ మంత్రి మల్లా రెడ్డి అల్లుడు ప్రస్తుత మల్కాజ్ గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కబ్జాల పర్వం వెలుగుచూసింది. చెరువును కబ్జా చేసి కాలేజీ భవనాలు నిర్మించారని పలువురు కంప్లైంట్ చేయడంతో అధికారులు చర్యలకు పూనుకున్నారు.

మల్లారెడ్డి కుటుంబానికి అధికారులు షాక్ ఇచ్చారు. తన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన ఎంఎల్ఆర్ఐటీ కాలేజీలు అక్రమంగా నిర్మించారన్న ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. దుండిగల్ లోని చిన్నదామర చెరువును కబ్జా చేసి కాలేజీలు నిర్మించారని ఫిర్యాదులు అందడంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఏరోనాటికల్ ఎంఎల్ఆర్ఐటీ కళాశాలలకు సంబంధించిన రెండు శాశ్వత భవనాలు, ఆరు తాత్కాలిక షెడ్లను కూల్చి వేశారు. మర్రి రాజశేఖర్ రెడ్డి మొత్తం 6 ఎకరాల్లో కబ్జా చేశారని ఇరిగేషన్ అధికారులు గుర్తించి ప్రభుత్వానికి కంప్లైంట్ చేశారు. ఈ క్రమంలోనే కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, పోలీస్ సిబ్బంది ఆద్వార్యంలో కూల్చివేతలు ప్రారంభించారు.

Show comments