P Venkatesh
ఇంటర్ మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు గుడ్ న్యూస్. డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) నోటిఫికేషన్ వచ్చేస్తోంది. ఎప్పుడు విడుదలకానుందంటే?
ఇంటర్ మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు గుడ్ న్యూస్. డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) నోటిఫికేషన్ వచ్చేస్తోంది. ఎప్పుడు విడుదలకానుందంటే?
P Venkatesh
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల సందడి ముగిసింది. ఇక ఇప్పుడు విద్యార్థుల దృష్టంతా ఏ కోర్సుల్లో చేరాలి? ఫ్యూచర్ బాగుండాలంటే ఏ కోర్సులు బెస్ట్.. త్వరగా ఉపాధి అవకాశాలు పొందాలంటే అందుబాటులో ఉన్న కోర్సులు ఏంటా అని ఆరా తీస్తున్నారు. ఇంటర్ తర్వాత చాలామంది స్టూడెంట్స్ ఇంజనీరింగ్ వైపు వెళ్లాలనుకుంటారు. ఐటీ ఉద్యోగాలయితే లక్షల్లో జీతాలు అందుకోవచ్చని భావిస్తుంటారు. మరికొంతమంది డిగ్రీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. మరి మీరు కూడా డిగ్రీ చేయాలనుకుంటున్నారా? అయితే డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ రిలీజ్ కానుంది.
తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల పరిధిల్లోని డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) నోటిఫికేషన్ వచ్చేస్తోంది. రేపు అనగా శుక్రవారం(03-05-2024) నాడు 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన దోస్త్ నోటిఫికేషన్ ఉన్నత విద్యామండలి విడుదల చేయనుంది. అదే సమయంలో దోస్త్ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అధికారులు ప్రారంభించనున్నారు. మొత్తం మూడు విడతల్లో డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టనున్నారు. ఆయా డిగ్రీ కాలేజీల్లో ఫస్టియర్‌లో ప్రవేశాల కోసం స్టూడెంట్స్ దోస్త్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులు దోస్త్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
దోస్త్ పరిధిలో రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలో 1054 డిగ్రీ కాలేజీలుండగా, వాటిలో 136 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, నాన్ దోస్త్ కాలేజీలు 63 ఉన్నాయి. మిగిలినవి ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 3,86,544 డిగ్రీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ తదితర కోర్సుల్లోని సీట్లను దోస్త్ ద్వారా భర్తీ చేయనున్నారు.