P Krishna
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరేవర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీ పథకాల్లో 2 గ్యారెంటీలను ప్రారంభించారు. ప్రజా పాలన కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం ప్రారంభించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరేవర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీ పథకాల్లో 2 గ్యారెంటీలను ప్రారంభించారు. ప్రజా పాలన కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం ప్రారంభించారు.
P Krishna
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు గ్యారెంటీల పథకాల అమలుపై కసరత్తు మొదలు పెట్టారు. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రగతి భవన్ ని ప్రజా భవన్ గా పేరు మార్చి ‘ప్రజా వాణి’ కార్యక్రమం ద్వారా ప్రజలు తమ సమస్యలు తెలుపుకునే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంతే కాదు రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ఆరు గ్యారెంటీల పథకాలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించేందుకు ‘ప్రజా పాలన’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మారు మూల గ్రామాల నుంచి పట్టణాల వరకు భారీ స్పందన వస్తుంది. తాజాగా ప్రజా పాలన కు సంబంధించిన ఓ గుడ్ న్యూస్ చెప్పారు సీఎస్ శాంతకుమారి. వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన ప్రజా పాలన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంత కుమారి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన సదస్సులు మూగియగానే దరఖాస్తుల్లోని డేటా ఎంట్రీ ప్రక్రియ వెంటనే చేపట్టి.. ఈ నెల 17 వరకు పూర్తి చేయాలని కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. ఈ నెల 6 నుంచి 17 లోపు అన్ని దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తి కావాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. మండల కేంద్రాల్లోనూ దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియ మొదలు పెట్టాలని అన్నారు. డేటా ఎంట్రీపై రాష్ట్ర స్థాయి సిబ్బందికి ఈ నెల 4న, జిల్లా స్థాయి సిబ్బందికి ఈ నెల 5 న శిక్షణ ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు.
డిసెంబర్ నెల 28వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం కొత్త సంవత్సరం సందర్భంగా రెండు రోజులు విరామం ఏర్పడిన విషయం తెలిసిందే. జనవరి 6వ తేదీ నాటికి దరఖాస్తులు దాదాపు కోటి దాటే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎక్కువగా తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు ప్రామాణికంగా లబ్ధిదారుల డేటాను ఎంట్రీ చేయాల్సి ఉంటుందని సీఎస్ శాంత కుమారి ఆదేశించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఇక నుంచి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలిపారు. ఇప్పుడు ఎలా దరఖాస్తు చేసుకున్నారో అదే విధంగా చేసుకోవొచ్చు అని పేర్కొన్నారు. దీంతో అర్హులైన ప్రజలకు పథకాలు పూర్తిగా అందే ఛాన్స్ ఉందని అన్నారు.
నాలుగు నెలలకోసారి ప్రజాపాలన – CS శాంతి కుమారి
4 నెలలకోసారి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.. ఇప్పుడు దరఖాస్తు చేయలేనివారు ఆ సమయంలో దరఖాస్తు చేసుకోవచ్చు – CS శాంతి కుమారి pic.twitter.com/zum85lCr63
— Telugu Scribe (@TeluguScribe) January 3, 2024