ఖైరతాబాద్‌, చింతల్‌ బస్తీ టౌన్‌షిప్‌లో రోడ్డుపైకి వచ్చిన మొసలి!

హైదరాబాద్‌ నగరంలో ఈ సాయంత్రం వర్షం దంచి కొట్టింది. పలు ప్రాంతాల్లో కుండపోతం వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయం అయ్యాయి. నాలాలు ఉప్పొంగాయి. మురుగు నీరు రోడ్లపై పొంగి ప్రవహించింది. ఈ నేపథ్యంలోనే ఖైరతాబాద్‌లో ఓ భయంకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ మొసలి రోడ్డుపైకి కొట్టుకు వచ్చింది. ఖైరతాబాద్‌, చింతల్‌ బస్తీ టౌన్‌ షిప్‌లో నిర్మాణంలో ఉన్న ఓ వంతెన దగ్గర మొసలి దర్శనం ఇచ్చింది. దీంతో జనం భయపడిపోయారు. దాన్ని అక్కడినుంచి తరిమేసే ప్రయత్నం చేశారు. అది కూడా భయపడిపోయి అరవటం మొదలుపెట్టింది. దాని అరుపుతో జనం జడుసుకున్నారు.

జనం తలో దిక్కూ పరుగులుపెట్టారు. ఆ తర్వాత కొంతమంది అటవీశాఖ అధికారులకు, జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫోన్‌ చేశారు. భారీ వర్షం కారణంగా మొసలి డ్రైనేజీ నీటి లోంచి కొట్టుకు వచ్చి ఉంటుందని, ఏం భయపడవద్దని అధికారులు తెలిపారు. ఆ మొసలి ఏమైంది? ఎక్కడికి వెళ్లింది? అధికారులు దాన్ని పట్టుకున్నారా? లేక వారు అక్కడికి వేళ్లే లోగా అది అక్కడినుంచి వెళ్లిపోయిందా? అన్నది తెలియరావాల్సి ఉంది. మరి, ఖైరతాబాద్‌, చింతల్‌ బస్తీలో మొసలి రోడ్డుపైకి రావటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments