Krishna Kowshik
ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తెరపై కనిపించలేదు. ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరోను చూద్దామా అని ఎదురు చూస్తున్న తారక్ ఫ్యాన్స్‌కు దేవర విషయంలో షాక్ తగిలింది. ఏప్రిల్ 5న విడుదల కాావాల్సిన ఈ సినిమా అక్టోబర్ నెలలోకి వెళ్లింది. దీంతో కొంత నిరాశలో ఉన్న అభిమానులకు తారక్ దర్శన భాగ్యం కలిగింది.
ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తెరపై కనిపించలేదు. ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరోను చూద్దామా అని ఎదురు చూస్తున్న తారక్ ఫ్యాన్స్‌కు దేవర విషయంలో షాక్ తగిలింది. ఏప్రిల్ 5న విడుదల కాావాల్సిన ఈ సినిమా అక్టోబర్ నెలలోకి వెళ్లింది. దీంతో కొంత నిరాశలో ఉన్న అభిమానులకు తారక్ దర్శన భాగ్యం కలిగింది.
Krishna Kowshik
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్‌తో బిజీగా ఉంటున్న సంగతి విదితమే. కొరటాల శివ దర్వకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. బాలీవుడ్ భామ, ఒకప్పటి అందాల తార శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ఈ చిత్రంతో తెలుగు నాట అడుగుపెడుతోంది. సైఫ్ అలీఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నటిస్తోన్న మూవీ కావడంతో దేవరపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రూ. 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ పిక్చర్.. అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తయ్యి ఉంటే.. ఈ నెల 5న విడుదల అయ్యేది. కానీ వీఎఫ్ఎక్స్ ఇతర సమస్యల కారణంగా ఈ సినిమా వాయిదా పడింది. అక్టోబర్ 10న మూవీ కొత్త రిలీజ్ డేట్ పిక్స్ చేసింది చిత్ర యూనిట్.
తమ హీరోను తెరపై చూసుకుందామని ఎంతగానో ఎదురు చూస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఇది కాస్త నిరాశ కలిగిచింది. అయితే తాజాగా తారక్ దర్శన భాగ్యం కలిగింది అభిమానులకు. హైదరాబాద్ ఆర్టీఓ ఆఫీసులో ప్రత్యక్షమై కెమెరా కంటికి కనిపించాడు . ఎన్టీఆర్ గ్యారేజీలో ఇప్పటికే ఖరీదైన వాహనాలు ఉండగా.. ఆ జాబితాలోకి మరో కారు వచ్చి చేరింది. ఇటీవల ఈ నందమూరి హీరో మెర్సిడెస్ బెంజ్ కారు కొనుగోలు చేశాడు. మెర్సిడెస్ బెంజ్ మే బ్యాచ్ ఎస్- క్లాస్ ఎస్ 580 మోడల్ కారును సొంతం చేసుకున్నారు. ఈ కారు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయానికి వచ్చారు యంగ్ టైగర్. బ్లాక్ కారులో ఉన్న కొత్త కారు దగదగా మెరిసిపోతుంటే.. మన హీరో కూడా బ్లాక్ అవుట్, బ్లూ అవుట్ ఫిట్‌లో వావ్ అనిపించారు. కాగా, యంగ్ టైగర్ కొనుగోలు చేసిన ఆ కారు ఖరీదు చూస్తే దిమ్మతిరగాల్సిందే.
కాగా, మెర్సిడస్ కారు ధర చూస్తే.. వామ్మో అనాల్సిందే. ఎక్స్ షో రూం ధర అక్షరాలా 2,71,70,000 రూపాయలట. ఇక రిజిస్ట్రేషన్ నిమిత్తం అయిన ఖర్చు సుమారుగా రూ. 49 లక్షలు వెచ్చించాడు. ఇన్సురెన్స్ 10, 76, 963 రూపాయలు, ఇతర ఖర్చులు 2,71, 000 లక్షలు పెట్టాడు. ఈ కారు తన సొంతం చేసుకోవడానికి అయి ఖర్చు మూడు కోట్లను దాటి పోయింది. మొత్తంగా కారు కోసం తారక్ ఎంత వెచ్చించాడంటే అక్షరాలా. రూ. 3, 34, 09, 263. రిజిస్ట్రేషన్,ఫ్యాన్సీ నంబర్ కోసం ఆర్టీఓ కార్యాలయానికి 49 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్‌కు కేవలం కారుల కలెక్షనే కాదూ బైక్స్, వాచెస్ కూడా చాలా ఇష్టం. ఇప్పటికే అతడి గ్యారేజీలో సుజుకీ హయాబుసా బైక్ తో పాటు లాంబోర్జిని కారు, 2.3 కోట్ల విలువ చేసే రేంజ్ రోవర్ వోగ్, బీఎండబ్ల్యూ 720 ఎల్ డీ, పోర్సే కారు, మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ కారు కూడా ఉంది. ప్రైవేట్ జెట్ కూడా ఉన్న సంగతి విదితమే. ఇప్పుడు వీటి చెంతకు చేరింది ఈ కొత్త కారు.
#JrNTR was snapped at Khairtabad RTO office for the registration of his newly bought Mercedes-Benz Maybach S-Class S 580. pic.twitter.com/aSWjz1pWxO
— Gulte (@GulteOfficial) April 2, 2024