iDreamPost
android-app
ios-app

సామాన్యుడిలా RTO ఆఫీస్ కి అల్లు అర్జున్! కారణం ఏమిటంటే?

  • Published Mar 20, 2024 | 5:02 PM Updated Updated Mar 20, 2024 | 5:02 PM

ప్రస్తుతం అందరు అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప-2 సినిమా గురించే ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడిపుడే ఒక్కొక్కటిగా ఈ సినిమా గురించి అప్ డేట్స్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. అయితే, ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్ లో ప్రత్యేక్షమయ్యాడట.

ప్రస్తుతం అందరు అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప-2 సినిమా గురించే ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడిపుడే ఒక్కొక్కటిగా ఈ సినిమా గురించి అప్ డేట్స్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. అయితే, ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్ లో ప్రత్యేక్షమయ్యాడట.

  • Published Mar 20, 2024 | 5:02 PMUpdated Mar 20, 2024 | 5:02 PM
సామాన్యుడిలా RTO ఆఫీస్ కి అల్లు అర్జున్! కారణం ఏమిటంటే?

పాన్ ఇండియా లెవెల్లో బన్నీ , సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా “పుష్ప-2”. ఇప్పటికే ఈ సినిమా గురించి అందరికి భారీ ఎక్స్పెక్టషన్స్ ఉన్నాయి. ఇక పుష్ప-1 సినిమాకు వరల్డ్ వైడ్ గా వచ్చిన టాక్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు ఈ సినిమాలో నటించిన వారందరికీ కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఇప్పుడు అందరూ పుష్ప-2 గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా గురించి ఇప్పటివరకు ఒక్కొక్కటిగా వస్తున్న అప్ డేట్స్.. అందరికి ఆ రేంజ్ లో ఎక్స్పెక్టషన్స్ ను పెంచేస్తున్నాయి. దీనితో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.ఇక ఆగస్టు 15 న ఈ సినిమా విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా అల్లు అర్జున్ ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్ లో ప్రత్యేక్షమయ్యాడు.

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమాతో ఎంత బిజీగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్యాప్ లేకుండా ఈ సినిమా కోసం తన కంప్లీట్ లుక్ నే చేంజ్ చేసి.. ఎంతో కష్టపడుతున్నారు. ఇటీవల.. ఈ సినిమా ఫ్రాంచైజ్ కోసం అల్లు అర్జున్ జెర్మనీలో జరిగిన బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు నిర్మతతో కలిసి వెళ్లారు. ఇక ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్ లో ప్రత్యేక్షమయ్యాడు. అక్కడ విదేశాల్లో డ్రైవింగ్ చేయడం కోసం.. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ను అప్లై చేశారు బన్నీ. ఫార్మ్ 4A ను సమర్పించి.. దానికి తగిన అమౌంట్ ను కూడా చెల్లించి.. దానికి తగిన ప్రాసెస్ ను పూర్తి చేశారు. బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ తర్వాత తిరిగి బన్నీ బయట కనిపించడంతో.. అభిమానులు బన్నీ లుక్స్ ని చూసి మురిసిపోయారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పొడవాటి గడ్డం, జుట్టుతో దర్శనం ఇచ్చారు. దీనితో సోషల్ మీడియాలో ఈ ఫోటోలు అందరికి ఇంట్రెస్టింగ్ గా మారాయి.

AA

ఇక పుష్ప-2 సినిమా విషయానికొస్తే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి.. ఇంటర్వెల్ కు ముందు జరగబోయే.. జాతర సీన్స్ గురించి , అలాగే కొన్ని యాక్షన్ సన్నివేశాల గురించి వచ్చిన అప్ డేట్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. అనుకున్న సమయానికి కనుక సినిమా విడుదలైతే ఖచ్చితంగా థియేటర్ లో .. ఈ సినిమా అందరికి పూనకాలు తెప్పిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటివరకు మిగిలిన సినిమాలలో వచ్చిన ఐకానిక్ సీన్స్ కు మించి .. ఈ సినిమాలో సీన్స్ ఉండబోతున్నట్లు కూడా గతంలో దర్శకుడు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఇప్పటికి ఈ సినిమాకు సంబంధించి ఓవర్సీస్ డీల్ కూడా క్లోజ్ అయినట్లు సమాచారం. ఇంకా ఈ సినిమాపై వచ్చే అప్ డేట్స్ అభిమానులలో ఎటువంటి హైప్ ను క్రియేట్ చేస్తాయో వేచి చూడాలి. మరి, బన్నీ రీసెంట్ లుక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss