iDreamPost
android-app
ios-app

కొన్ని గంటల్లో వైన్స్ బంద్.. ఏకంగా రెండు రోజులపాటు

Liquor Shops: మద్యం ప్రియులకు షాక్. ఏకంగా రెండురోజుల పాటు వైన్స్ బంద్ కానున్నాయి. ఈ మేరకు సీపీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేసారు. ఏయే తేదీల్లో బంద్ కానున్నాయంటే?

Liquor Shops: మద్యం ప్రియులకు షాక్. ఏకంగా రెండురోజుల పాటు వైన్స్ బంద్ కానున్నాయి. ఈ మేరకు సీపీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేసారు. ఏయే తేదీల్లో బంద్ కానున్నాయంటే?

కొన్ని గంటల్లో వైన్స్ బంద్.. ఏకంగా  రెండు రోజులపాటు

ఈ రోజుల్లో సంతోషమైనా బాధైన మందుతోనే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వేడుకలు, ఫంక్షన్స్ లో మద్యం తప్పని సరిగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. కొందరికైతే చుక్క పడనిదే పొద్దు గడవదు. వైన్స్ షాప్స్ ఎప్పుడెప్పుడు తెరుస్తారా అంటూ ఎదురుచూస్తుంటారు. ఇక మద్యం షాపులు క్లోజ్ ఉన్న రోజు వీరి బాధ వర్ణణాతీతం. ఇటీవల చాలాసార్లు మద్యం దుకాణాలు బంద్ అవుతున్నాయి. పండగలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో వైన్స్ ను క్లోజ్ చేస్తున్నారు. దీంతో మందు బాబులు నిరాశ చెందుతున్నారు. ఈ క్రమంలో మద్యం ప్రియులకు పిడుగు లాంటి వార్త. మరి కొన్ని గంటల్లో వైన్స్ బంద్ కానున్నాయి. ఏకంగా రెండు రోజుల పాటు వైన్స్ మూతపడనున్నాయి.

హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనాల కార్యక్రమం జరుగుతున్న విషయం తెలిసిందే. గణపయ్య భక్తులు భక్తి శ్రద్ధలతో ఆటపాటలతో శోభాయాత్రలో పాల్గొంటున్నారు. ఎక్కడ చూసినా లంబోధరుడి నిమజ్జనాల కోలాహలమే కనిపిస్తున్నది. వేల సంఖ్యలో వినాయక విగ్రహాలు నిమజ్జనానికి రెడీ అయ్యాయి. ఇప్పటికే రోడ్లన్నీ రద్దీగా మారాయి. నగరంలోని ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. కాగా నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

దీనిలో భాగంగానే సెప్టెంబర్ 17, 18 తేదీల్లో వైన్స్ బంద్ చెయ్యాలని సీపీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేసారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో అన్ని రకాల మద్యం షాపులను(వైన్స్, కల్లు దుకాణాలు, బార్లు, బార్ అండ్ రెస్టారెంట్లు) మూసేయాలని ఆర్డర్స్ జారీ చేశారు. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అయితే స్టార్ హోటల్ బార్‌లు, రిజిస్టర్ క్లబ్‌లకు ఈ ఆదేశాలు వర్తించవని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.