iDreamPost
android-app
ios-app

తెలంగాణ రాష్ట్ర గీతం చుట్టూ వివాదం! అసలు కీరవాణి తప్పేంటి? పూర్తి వివరాలు!

  • Published May 29, 2024 | 12:44 PMUpdated May 29, 2024 | 12:44 PM

Jaya Jayahe Telangana Song: తెలంగాణ రాష్ట్ర గీత జయ జయహే తెలంగాణ వివాదాలకు అడ్డగా మారింది. దీనికి స్వరాలు సమకూర్చే బాధ్యతను కీరవాణికి అప్పగించడంతో.. వివాదం రాజుకుంది. ఆ వివరాలు..

Jaya Jayahe Telangana Song: తెలంగాణ రాష్ట్ర గీత జయ జయహే తెలంగాణ వివాదాలకు అడ్డగా మారింది. దీనికి స్వరాలు సమకూర్చే బాధ్యతను కీరవాణికి అప్పగించడంతో.. వివాదం రాజుకుంది. ఆ వివరాలు..

  • Published May 29, 2024 | 12:44 PMUpdated May 29, 2024 | 12:44 PM
తెలంగాణ రాష్ట్ర గీతం చుట్టూ వివాదం! అసలు కీరవాణి తప్పేంటి? పూర్తి వివరాలు!

ప్రస్తుతం తెలంగాణలో రాజకీయమంతా.. రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ చుట్టూనే తిరుగుతుంది. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఈ పాటది ప్రత్యేక ప్రస్థానం. ఉద్యమ సమయంలో ఎందరిలోనో స్ఫూర్తిని నింపింది ఈ పాట. ఉద్యమకారుల్లో అగ్నిని రగిల్చింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యక్రమాల్లో దీన్ని తెలంగాణ ప్రార్థనా గీతంగా ఆలపిస్తున్నారు. అందెశ్రీ రచించిన ఈ గీతానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆరే మెరుగులు దిద్దారు.

ఈ పాట మొత్తంలో 11 చరణాలు ఉండగా.. దీనిలో నాలుగు చరణాలను ఎంచుకుని రాష్ట్ర గీతంగా పాడాలని అప్పటి కేసీఆర్‌ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దీన్ని రాష్ట్ర గీతంగా అధికారికంగా గుర్తించలేదు. ఇక తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. జయ జయహే తెలంగాణ పాటను రాష్ట్రీయ గీతంగా ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.

అయితే ఈ నిర్ణయంతో ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ల మధ్య రాజకీయ రగడ రాజుకుంది. అంతేకాక.. ఈ పాటకు సంగీతాన్ని సమకూర్చాల్సిన బాధ్యతను ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్‌ అవార్డ్‌ గ్రహీత ఎంఎం కీరవాణికి అప్పగించారు రేవంత్‌రెడ్డి. ఈ క్రమంలో మే 21న సీఎం రేవంత్‌.. కీరవాణితో భేటీ అయ్యారు. పాట ఇప్పటికే పూర్తి కావచ్చిందని తెలుస్తోంది. కొత్త పాట సుమారు 13 నిమిషాల పాటు ఉందనుందని సమాచారం. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా అనగా జూన్‌ 2న దీన్ని ఆలపన చేయనున్నారు. అయితే ఈ పాట సంగీత పర్యవేక్షణ బాధ్యతలను కీరవాణికి అప్పగిచడం కాస్త వివాదాస్పదంగా మారింది.

కీరవాణి బాధ్యతలపై విమర్శలు..

తెలంగాణ రాష్ట్రీయ గీతంగా ప్రకటించిన జయ జయహే తెలంగాణ పాటకు కీరవాణి సంగీత అందించడం పట్ల తెలంగాణ సినీ మ్యూజీషియన్స్‌ అసోసియేషన్‌ అంసతృప్తి వ్యక్తం చేస్తోంది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ‘జయ జయహే తెలంగాణ’ గేయానికి సంగీతం అందించే బాధ్యతను పొరుగు రాష్ట్రానికి చెందిన కీరవాణికి ఇవ్వడం చారిత్రక తప్పిదం అవుతుందని టీసీఎంఏ నేతలు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఈ నిర్ణయం తెలంగాణ కళాకారులను అవమానించడమే అవుతుందని అన్నారు. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల్లో.. ఈ పాటకు సంగీతం అందించే వారు ఒక్కరు కూడా మీకు కనిపించలేదా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రేవంత్‌ ఏమన్నారంటే..

అయితే ఈ విమర్శలపై రేవంత్‌ రెడ్డి స్పందించారు. తెలంగాణ గేయానికి సంగీతం సమకూర్చడం సహా మొత్తం వ్యవహారాన్ని గీత రచయిత అందెశ్రీకే అప్పగించామని తెలిపారు. కీరవాణి వ్యవహారంతో తనకు సంబంధం లేదని.. ఈ పాటకు ఎవరితో సంగీతం చేయించుకోవాలనేది పూర్తిగా అందెశ్రీ నిర్ణయమే అన్నారు. తెలంగాణ అంటే త్యాగాలు, పోరాటాలు గుర్తుకు వస్తాయి. అందుకే రాష్ట్రం పేరు చెప్పగానే.. తెలంగాణ కోసం జరిగిన పోరాటాలు గుర్తొచ్చేలా చిహ్నం, గేయం రూపొందిస్తున్నాం అన్నారు. అంతేకాక రాజముద్ర రూపకల్పన బాధ్యతను ఫైన్‌ ఆర్ట్స్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌కు అప్పగించామని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు.

అందెశ్రీ స్పందన అంటూ ఆడియో లీక్‌..

దీనిపై అందెశ్రీ మాట్లాడినట్లు ఓ ఆడియో రికార్డ్‌ వైరల్‌ అవుతుంది. దీనిలో ఉన్న దాని ప్రకారం.. ఈ గీతాన్ని రచించింది తెలంగాణకు చెందిన వ్యక్తి అయిన తానే అని స్పష్టం చేశాడు. పదాలను తాను కూర్చానని.. ఇక దానికి స్వరాలు ఎవరు ఇస్తే ఏంటి.. ఎవరు పాడితేనేం.. కీరవాణి గొప్ప మ్యూజిక్‌ డైరెక్టర్‌.. ఏకంగా ఆస్కార్‌ అవార్డు అందుకున్నారు. అలాంటి ప్రతిభావంతుడిని తెలంగాణ గీతం కోసం వాడుకుంటే తప్పేంటి.. కళాకారులకు ప్రాంతం, కులం, భాషతో సంబంధం ఉండడు కదా అని అందెశ్రీ అన్నట్లుగా ఆ వీడియోలో ఉంది. అయితే ఇది అందెశ్రీ మాట్లాడిన ఫోన్‌ కాలే అని ఎలాంటి క్లారిటీ లేదు. దీనిపై ఆయన సైతం స్పందించలేదు కూడా.

ఈ గీతానికి స్వరాలు సమకూర్చమంటూ కీరవాణికి రేవంత్‌ రెడ్డి బాధ్యత అప్పగించారు. అందుకు గీత రచయిత అందెశ్రీ కూడా అంగీకరించారు. ఒక మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఆయన ఆ బాధ్యతను అంగీకరించారు. ఓ సినిమాకు ఎలా స్వరాలు సమకూరుస్తారో.. అలానే ఇప్పుడు ఈ గీతానికి స్వరాలు సమకూర్చడానికి ముందుకు వచ్చారు. ఆయనే వృత్తే అది. దాన్నే పాటిస్తున్నారు. అయితే కొందరు కావాలనే ఈ వివాదంలో కీరవాణిని టార్గెట్‌ చేసి.. విమర్శలు చేస్తున్నారని కీరవాణి మద్దతుదారులు అంటున్నారు. మరి చివరకు ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి. జయ జయహే తెలంగాణ పాటకు సంగీతాన్ని అందించే బాధ్యతను కీరవాణికి అప్పగించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి