iDreamPost
android-app
ios-app

Revanth Reddy: యువతికి కానిస్టేబుల్ సాయం.. CM రేవంత్ రెడ్డి ప్రశంసలు!

సామాన్యులు ఆపదలో ఉన్నప్పుడు దేవుళ్లల వచ్చి పోలీసులు కాపాడుతుంటారు. అలాంటి వారికి పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తుంటాయి. తాజాగా ఓ పోలీస్ కానిస్టేబుల్ పై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు.

సామాన్యులు ఆపదలో ఉన్నప్పుడు దేవుళ్లల వచ్చి పోలీసులు కాపాడుతుంటారు. అలాంటి వారికి పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తుంటాయి. తాజాగా ఓ పోలీస్ కానిస్టేబుల్ పై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు.

Revanth Reddy: యువతికి కానిస్టేబుల్ సాయం.. CM రేవంత్ రెడ్డి ప్రశంసలు!

పోలీసులు అంటే మనకు విధి నిర్వహణలో వారు చూపి కాఠిన్యమే గుర్తుకు వస్తుంది. ప్రజల రక్షణ కోసం విధులు నిర్వహించే వారు.. నేరాలను, ప్రభుత్వ రూల్స్ ను అతిక్రమించే వారి విషయంలో అలా కఠినంగా ప్రవర్తిస్తారు. అలా వారు బయటకు కఠినంగా కనిపించినా..వారి మనస్సుకు ఎంతో చాలా సున్నితమైనది. అలానే సామాన్యులు ఆపదలో ఉన్నప్పుడు దేవుళ్ల వచ్చి పోలీసులు కాపాడుతుంటారు. అంతేకాక ఎవరైన విద్యార్థులు పరీక్షల సమయంలో ఇబ్బందులు పడితే.. పోలీసులే సాయం చేసి..వారిని పరీక్ష కేంద్రాలకు చేరుస్తుంటారు. ఇలాంటి వారిపై ప్రశంసలు వస్తుంటాయి. తాజాగా పోలీస్ కానిస్టేబుల్ పై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. మరి.. ఆ కానిస్టేబుల్ చేసిన పని ఏమిటి, ఆవివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆదివారం దేశ వ్యాప్తంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు జరిగాయి. దేశ వ్యాప్తంగా 80 కేంద్రాల్లో ఈ  పరీక్షలు జరిగాయి. పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు నిబంధనలు స్ట్రిక్ట్ గా అమలు చేశారు. అరగంట ముందే గేట్లను మూసివేశారు. ఇక ఈ ఒక్క నిమిషం నిబంధనతో కారణంగా కొంతమంది విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు. అయితే పరీక్షకు హడావిడిగా వెళ్తున్న ఓ యువతిని ట్రాఫిక్ కానిస్టేబుల్ పరీక్ష కేంద్రానికి తరలించిన ఆమె పరీక్ష రాసేందుకు సాయపడ్డాడు. ఇక కానిస్టేబుల్ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.

ఆదివారం హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాసేందుకు ఓ యువతి ఆర్టీసీ బస్సులో వెళ్లింది. రాజేంద్రనగర్‌లోని మహావీర్ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్ష కేంద్రానికి ఆ యువతి చేరుకోవాల్సి ఉంది. అయితే పొరపాటునా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న మైలార్ దేవుపల్లి బస్టాప్ వద్ద దిగింది. ఇక అక్కడి నుంచి పరీక్ష కేంద్రంకి చేరుకునే సమయం చాలా తక్కువగా ఉంది. సమయం మించి పోవడంతో ఆ యువతి కంగారు పడుతోంది.

అదే సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ గమనించాడు. యువతి పరిస్థితి అర్థం చేసుకుని  అసలు విషయం తెలుసుకున్నారు. ఆలస్యం చేయుకుండా వెంటనే ఆ యువతిని పోలీస్ బైకుపై కానిస్టేబుల్ పరీక్ష కేంద్రం వద్దకు సమయానికి తీసుకెళ్లి దించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతేకాక చాలా మంది  కానిస్టేబుల్ సురేష్ పై ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ కానిస్టేబుల్ ను ఎక్స్ వేదికగా అభినందించారు.

వెహికల్ కంట్రోల్ మాత్రమే తమ విధి అనుకోకుండా..సాటి మనిషికి సాయం చేయడం కర్తవ్యంగా భావించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ అభినందనలు అంటూ ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. అలానే సురేష్ సహాయంతో పరీక్షా కేంద్రానికి వెళ్లి పరీక్ష రాసిన సోదరి.. యూపీఎస్సీ పరీక్షల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నాను అంటూ ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. మరి.. ఈ కానిస్టేబుల్ కు మీరు అభినందనలు తెలపాలనుకుంటే.. కామెంట్స్ రూపంలో తెలియజేయండి.