P Venkatesh
ములుగు నియోజకవర్గంలో ధనసరి అనసూయ అలియాస్ సీతక్క విజయం సాధించారు. బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను ఓడించి సీతక్క గెలుపొందారు. సీతక్క గెలుపుతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు సంతోషంలో మునిగిపోయారు.
ములుగు నియోజకవర్గంలో ధనసరి అనసూయ అలియాస్ సీతక్క విజయం సాధించారు. బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను ఓడించి సీతక్క గెలుపొందారు. సీతక్క గెలుపుతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు సంతోషంలో మునిగిపోయారు.
P Venkatesh
ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ధనసరి అనసూయ అలియస్ సీతక్క విజయ దుందుభి మోగించారు. ఆదివాసి మహిళగా అక్కడి ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకున్న సీతక్కకు ప్రజలు అఖండ విజయాన్ని అందించారు. కాగా ములుగులో బీఆర్ఎస్ నుంచి బడే నాగజ్యోతి, బీజేపీ నుంచి అజ్మీరా ప్రహ్లాద్ పోటీ చేశారు. గెలుపు నీదా నాదా అన్నట్లు సాగిన పోరులో సీతక్క విక్టరీ కొట్టారు. ఇక సీతక్క గెలుపుతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టంపయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కౌంటింగ్ లో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా సుపరిచితురాలైన సీతక్కకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. పేద ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుని నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే నియోజకవర్గ ప్రజలు సీతక్కను విజయతీరాలకు చేర్చారు. బీఆర్ఎస్ నుంచి పోటీచేసిన బడే నాగజ్యోతిపై 28 వేల ఓట్ల అధిక్యంతో విజయం సాధించారు. ఈ విజయంతో ములుగులో సీతక్క వరుసగా మూడు సార్లు విజయం సాధించినట్లైంది. మరి ములుగులో సీతక్క విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.