P Venkatesh
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో సబంరాలు జరుపుకుంటున్నారు లీడర్లు. ఈ క్రమంలో సీఎం అభ్యర్థిపై చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సీఎం పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో సబంరాలు జరుపుకుంటున్నారు లీడర్లు. ఈ క్రమంలో సీఎం అభ్యర్థిపై చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సీఎం పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
P Venkatesh
తెలంగాణ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి. కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచించిన కాంగ్రెస్ పార్టీ అంతిమంగా సక్సెస్ సాధించింది. ముందు నుంచి ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని విశ్వసించిన కాంగ్రెస్ లీడర్లు వారి అంచనాలను నిజం చేసుకున్నారు. అయితే కాంగ్రెస్ విజయం సాధిస్తున్న క్రమంలో సీఎం అభ్యర్థిపై చర్చలు మొదలయ్యాయి. ఓవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన రేవంత్ రెడ్డికే ఎక్కువ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నట్లు పలువురు లీడర్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు కూడా సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో భట్టి విక్రమార్క సీఎం పదవిపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంతో లీడర్లు, కార్యకర్తలు, శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు చర్చంతా సీఎం అభ్యర్థిపైననే జరుగుతోంది. ఈ నేపథ్యంలో మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తనను ముఖ్యమంత్రిని చేస్తే బాధ్యతాయుతంగా పనిచేస్తానని అన్నారు. రాష్ట్రంలో దొరల పాలన అంతమైంది.. ప్రజల తెలంగాణ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తాము. మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అనే నినాధంతో ప్రజలు చైతన్యవంతులై కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెట్టారు. ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయకుండా వారి ఆకాంక్షల మేరకు పని చేస్తామని ఆయన అన్నారు. కాగా మధిర నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన మల్లు భట్టి విక్రమార్క బీఆర్ఎస్ అభ్యర్థిపై భారీ మెజారిటీతో విజయం దిశగా దూసుకెళ్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో పాటు వ్యక్తిగతంగా కూడా మల్లు భట్టి విక్రమార్క ప్రజలకు హామీ ఇచ్చారు. బాండ్ పేపర్ రాసి దైవసన్నిధిలో ప్రమాణం చేశారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి కష్టాలను తీరుస్తానని, నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతానని భగవంతుడి ఎదుట ప్రమాణం చేశారు. కాగా విక్రమార్క 2009, 2014, 2018 ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాలు సాధించిన ఆయన ఈసారి కూడా గెలిచి రికార్డు సృష్టించబోతున్నారు. అయితే సీఎం అభ్యర్థిపై రేవంత్, భట్టీ మధ్యనే పోటీ ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతుందో? ఎవరినీ సీఎంగా ప్రకటిస్తుందో తెలియాలంటే అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.