iDreamPost
android-app
ios-app

వచ్చే పదేళ్లలో CM అవుతా.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు!

  • Author Soma Sekhar Published - 10:50 AM, Tue - 24 October 23

రాష్ట్రంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు పార్టీ అధిష్టానం ఇరకాటంలో పడుతోంది. మెున్న జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దూమారం రేపగా.. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే, సీనియర్ నేత జగ్గారెడ్డి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.

రాష్ట్రంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు పార్టీ అధిష్టానం ఇరకాటంలో పడుతోంది. మెున్న జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దూమారం రేపగా.. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే, సీనియర్ నేత జగ్గారెడ్డి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.

  • Author Soma Sekhar Published - 10:50 AM, Tue - 24 October 23
వచ్చే పదేళ్లలో CM అవుతా.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ.. ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. దానికి కారణం రాజకీయ నాయకులు చేసే వ్యాఖ్యలే. ఎన్నికల నగరా మోగినప్పటి నుంచి వివిధ పార్టీలకు చెందిన నేతలు చేసే కామెంట్స్ అధిష్టానానికి తలనొప్పిగా మరుతుంటే.. ప్రజలకు మాత్రం ఆశ్చర్యాన్ని కలగజేస్తున్నాయి. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు పార్టీ అధిష్టానం ఏం సమాధానం చెప్పాలో వారికే తెలియడం లేదు. మెున్న జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దూమారం రేపగా.. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే, సీనియర్ నేత జగ్గారెడ్డి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. వచ్చే పదేళ్లలో తాను సీఎం అవుతానని షాకింగ్ కామెంట్స్ చేశారు.

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన దగ్గర నుంచి పొలిటికల్ లీడర్స్ సంచలన కామెంట్స్ చేస్తూ.. వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తాను సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా మరో సీనియర్ నేత కూడా వచ్చే పదేళ్లలో తాను తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతానని సంచలన కామెంట్స్ చేశారు కాంగ్రెస్ ఎమ్మేల్యే జగ్గారెడ్డి. దసరా ఉత్సవాల్లో భాగంగా సంగరెడ్డిలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.

జగ్గారెడ్డి మాట్లాడుతూ..”విజయదశమి రోజు నా మనసులో మాట చెబుతున్నాను. వచ్చే పదేళ్లలో నేను తెలంగాణకు ముఖ్యమంత్రిని అవుతాను. మీ అందరికి తెలిసిందే.. సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి.. జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి. ఎన్నికల కోడ్ ఉండటంతో.. నా నోరు, చేతులు కట్టేసుకున్నాను. లేకపోతే మరిన్ని విషయాలు మీతో పంచుకునే వాడిని. నియోజకవర్గంలో నేను అందుబాటులో లేకున్నా.. నా భార్య, అనుచరులు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. కార్యకర్తలకు చిన్న కష్టం వచ్చినా.. అక్కడ వెంటనే వాలిపోతాను” అని చెప్పుకొచ్చారు జగ్గారెడ్డి. కాగా.. కాంగ్రెస్ సీనియర్ నేతలు వరుసగా సీఎం పదవిపై ఉన్న కోరికను ఒకరితర్వాత ఒకరు బయటపెడుతుండటంతో.. ఇటు ప్రజలతో పాటు.. అటు అధిష్టానం కూడా అయోమయానికి గురవుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థి ఎవరని? బీఆర్ఎస్ ప్రశ్నిస్తూ.. ఇరకాటంలో పెడుతోంది. అటు బీజేపీలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. మరి జగ్గారెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.