Arjun Suravaram
ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల ప్రచారం చాలా రసవత్తరంగా సాగుతోంది. అన్ని ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అయితే కొందరు మాత్రం పొరపాటున తమ ప్రత్యర్థి పార్టీకి జై కొడుతున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల ప్రచారం చాలా రసవత్తరంగా సాగుతోంది. అన్ని ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అయితే కొందరు మాత్రం పొరపాటున తమ ప్రత్యర్థి పార్టీకి జై కొడుతున్నారు.
Arjun Suravaram
ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు ఏడాదికో పార్టీ మారుతున్నారు. తామే పార్టీలో ఉన్నామో, మనం ఏ మాట్లాడుతున్నామో అనే విషయం వారికి గుర్తుకు రావడం లేదు. ఒక్కొక్కసారి ప్రత్యర్థి పార్టీకి జై కొట్టడం అలవాటులో పొరపాటుగా జరిగిపోతుంటుంది. అంతేకాక మరోవైపు నిత్యం ప్రత్యర్థి పార్టీ పేరును, ఆ పార్టీ నాయకుడి గురించి మాట్లాడుతూ… కూడా అలవాటులో ప్రత్యర్థికే జై అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలో గతంలోనూ ఏపీలో జరిగాయి. ఏపీకి మంచి జరగాలంటే సైకిల్ పోవాలని టీడీపీ నేతలు నినాదించారు. అంతేకాక మరోసారి సీఎంగా జగన్ ను గెలిపించాలని మరికొందరు టీడీపీ నేతలు అలవాటులో పొరపాటు అంటున్నారు. తాజాగా తెలంగాణలో ఎన్నికల్లో ఓ కాంగ్రెస్ అభ్యర్థి నోట జై కేసీఆర్ అనే మాట వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలంగాణలో ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది. ఓటింగ్ కి మరికొద్ది రోజులే ఉండటంతో అభ్యర్థులందరూ ప్రచారంలో బిజీబిజీ అయ్యారు. ఇక ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతేకాక ఓటర్ల దగ్గరకు వెళ్లి.. వారు చేసే పనుల్లో సాయం చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇక భారీ బహిరంగ సభలో నిర్వహిస్తూ.. ప్రజలను ఓట్లు అడుగుతున్నారు. ఇది అంతా బాగానే ఉన్నా… కొన్ని సందర్భాల్లో పార్టీల అభ్యర్థులు.. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి పార్టీని, పేరును పొరపాటును నినాదిస్తున్నారు.
ఇప్పటికే తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. అయితే తాజాగా జనగామా జిల్లాలో అలాంటి ఆసక్తికర ఘటన ఒకటి చోటు చేసుకుంది. జనగామా జిల్లా పాలకుర్తి నియోజవర్గం నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి మామిడాల యశస్విని రెడ్డి ఎన్నికల బరిలో నిల్చుకున్నారు. వాస్తవానికి ఆమె స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా యశస్విని అత్తగారైన ఝాన్సీ రెడ్డి పోటీ చేయాల్సి ఉంది. అయితే ఆమె పౌరసత్వ అంశంపై అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో.. యశస్విని ఎన్నికల బరిలో నిల్చున్నారు. 26 ఏళ్ల వయస్సున్న యశస్విని ప్రచారంలో దూసుకెళ్తోంది.
మంత్రిపై గెలిచి.. రికార్డు సృష్టించాలని ఆమె బలకం కోరుకుంటుంది. ఈక్రమంలోనే ప్రతి గ్రామాన్ని చుట్టేస్తుంది. ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మామిడాల యశస్విని రెడ్డి ప్రచారం ముగిసిన అనంతరం జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. మరి.. ఇలా ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి పార్టీలకు జై కొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మామిడాల యశస్విని రెడ్డి ప్రచారం ముగిసిన అనంతరం జై కేసీఆర్ అంటూ నినాదాలు pic.twitter.com/ObyjFIij86
— Telugu Scribe (@TeluguScribe) November 21, 2023