iDreamPost
android-app
ios-app

సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం.. వీరికే ఆహ్వానం!

  • Published Dec 06, 2023 | 1:03 PM Updated Updated Dec 06, 2023 | 1:03 PM

Revanth To Take Oath CM: తెలంగాణ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా ఎనుమల రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం గురువారం ఎల్బీ స్టేడియంలో జరగనుంది. ఈ వేడుకకు కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు పలువురు ప్రముఖలకు ఆహ్వానం పంపనున్నారు. వారిలో...

Revanth To Take Oath CM: తెలంగాణ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా ఎనుమల రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం గురువారం ఎల్బీ స్టేడియంలో జరగనుంది. ఈ వేడుకకు కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు పలువురు ప్రముఖలకు ఆహ్వానం పంపనున్నారు. వారిలో...

  • Published Dec 06, 2023 | 1:03 PMUpdated Dec 06, 2023 | 1:03 PM
సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం.. వీరికే ఆహ్వానం!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్  ఘన విజయం సాధించింది. అంతేకాక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన పూర్తి మెజార్టీతో కాంగ్రెస్ విజయం సాధించింది. 119 స్థానాలకు గాను 64 స్థానాల్లో విజయం సాధించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఏర్పాటుకు హస్తం పార్టీ నేతలు ప్రణాళికలు వేస్తున్నారు. ఇక, తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరగనుంది. గురువారం మధ్యాహ్నం 1.42 గంటలకు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు పలువురిని ఆహ్వానించనున్నారు.

రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నారు.  ఈ పనులను కాంగ్రెస్ నేతలు, అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి  పలువురు ప్రముఖులకు ఆహ్వానం అందించారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉండగా.. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత సోనియ గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే , కేసీ వేణుగోపాల్ ను కలిసి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. అంతేకాక కాంగ్రెస్ నేతలు రేవంత్ కార్యక్రమానికి హాజరుకావాలని ఏఐసీసీ నేతలకు ఇతర రాష్ట్రాల నేతలకు ఆహ్వానం పంపారు.

కర్టాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పాటు ఇతర మంత్రులకు ఆహ్వానం పంపానున్నారు. కాంగ్రెస్ పార్టీకీ చెందిన మాజీ ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లత్,  భూషేష్ బఘెల్, అశోక్ చౌహన్ లకు ఆహ్వానం పంపనున్నారు. అలానే ఏపీ, తమిళనాడు ముఖ్యమంత్రులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, స్టాలిన్ లకు ఆహ్వానం చేయనున్నారు.  అదే విధంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆహ్వానం పంపనున్నారు. గతంలో తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ఇంఛార్జీలుగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, కుంతియా, వాయిలార్ రవి, మాణిక్యం ఠాగూర్ మరికొందరు ముఖ్యులకు ఆహాన్వం పంపనున్నారు.

అదే విధంగా తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన చిదంబరం, మాజీ స్పీకర్ మీరాకుమారి, సుశీల్ కుమార్ షిండే మరికొందరు నేతలకు ఆహ్వానం పంపనున్నారు. తెలంగాణ ఉద్యమంలో  అమరులైన వారి కుటుంబాలకు కూడా ఆహ్వానం పంపనున్నారు. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, గాదె ఐన్నయ్య, హరగోపాల్, కంచ ఐలయ్య తోపాటు మరికొందరు ఉద్యమకారులను ఈ కార్యక్రమానికి పిలవున్నారు. చంద్రబాబు తో సహ వివిధ పార్టీల అధ్యక్షులకు కూడా ఆహ్వానం పంపనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వివిధ కుల సంఘాలు నేతలకు, మేధావులను రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం పంపనున్నారు.

Jojobet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbetjojobetgrandpashabetimajbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetcandycasino girişEscortes BelgiqueCasibomGrandpashabetgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomcasibom