iDreamPost
android-app
ios-app

దేశంలోనే తొలిసారి హైదరాబాద్ లో డ్రోన్ సర్వే! లాభం ఏంటంటే?

GHMC GIS Survey: హైదరబాద్ నగరంలో తొలిసారి డ్రోన్ సర్వే చేపట్టనున్నారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు జీహెచ్ ఎంసీ జీఐఎస్ సర్వే చేయనున్నట్లు ఆమ్రపాలి తెలిపారు.

GHMC GIS Survey: హైదరబాద్ నగరంలో తొలిసారి డ్రోన్ సర్వే చేపట్టనున్నారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు జీహెచ్ ఎంసీ జీఐఎస్ సర్వే చేయనున్నట్లు ఆమ్రపాలి తెలిపారు.

దేశంలోనే తొలిసారి హైదరాబాద్ లో డ్రోన్ సర్వే! లాభం ఏంటంటే?

వందల ఏళ్లు గడిచినా విలువ తగ్గనిది ఏదైనా ఉందంటే అది భూమి మాత్రమే అని చెప్పొచ్చు. జనాభా పెరగడంతో స్థలాలకు విపరీతంగా ధరలు పెరిగిపోయాయి. తులం బంగారం పోయినా బాధపడడం లేదు గానీ ఇంచు స్థలం మాత్రం వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. భూముల సర్వే కోసం ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. హైదరాబాద్ లో తొలిసారి డ్రోన్ సర్వే చేయనున్నారు జీహెచ్ ఎంసీ. ఈ సర్వే ద్వారా ఆస్తులను డిజిటల్ రూపంలో నిక్షిప్తం చేయడం, జిహెచ్ ఎంసీ రికార్డులకు ఓనర్ రికార్డులకు సరిపోతున్నాయా లేదా రికార్డులను కరెక్ట్ చేసేందుకే సర్వే చేయనున్నట్లు ఆమ్రపాలి తెలిపారు. ఈ సర్వే వల్ల ఎవరికీ కూడా నష్టం జరగదని.. ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని వెల్లడించారు.

హైదరాబాద్ నగరవాసులకు మెరుగైన సేవలను అందించేందుకు జీహెచ్ ఎంసీ జీఐఎస్ సర్వే చేస్తుందని కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. ఈ సర్వేలో ఎలాంటి అపోహలకు తావులేదని, సర్వే వివరాల ఆధారంగా ఆస్తి పన్ను పెంచబోతున్నారన్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. నగరవాసులకు ఇప్పుడున్న వసతులతో పాటు మరిన్ని నాణ్యమైన వసతులను కల్పించేందుకు పైలెట్ ప్రాజెక్టుగా సర్వే చేస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే తొలిసారి హైదరాబాద్ లో డ్రోన్ సర్వే చేయనున్నారు.

డ్రోన్ సర్వే ఆధారంగా మ్యాపులను సేకరించి వాటికి అనుగుణంగా ప్రతి ఆస్తికి డిజిటల్ అడ్రస్ లు ఇవ్వనున్నట్లు ఆమ్రపాలి తెలిపారు. రికార్డులను కరెక్టుగా రూపొందించేదుకు మాత్రమే డ్రోన్ సర్వే చేస్తున్నట్లు తెలిపారు. కరెక్ట్ అసెస్ మెంట్ కోసం మాత్రమే ఈ సర్వే చేస్తున్నట్లు వెల్లడించారు. పెరుగుతున్న నగర జనాభాకు తగిన విధంగా మౌళిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. హైదరాబాద్ వాసులకు మెరుగైన వసతులు కల్పించేందుకు జీఐఎస్ సర్వే యూజ్ అవుతుందని ఆమ్రపాలి తెలిపారు.