Cockroach Found in Biryani: బిర్యానీలో బొద్దింక.. నీ పెళ్ళాం వండితే బొద్దింక రాదా హోటల్ యజమాని సమాధానం!

బిర్యానీలో బొద్దింక.. నీ పెళ్ళాం వండితే బొద్దింక రాదా హోటల్ యజమాని సమాధానం!

Cockroach Found in Biryani: నిత్యం పని ఒత్తిడితో ఉండే వారు వీక్ ఎండ్ లో ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో హూటల్, రెస్టారెంట్ కి వెళ్లి ఇష్టమైన బిర్యాని తీంటుంటారు. ఈ మధ్య ఆహార భద్రతా విభాగం వారు వరుస దాడుల్లో సంచలన విషయాలు బయటపడుతున్నాయి.

Cockroach Found in Biryani: నిత్యం పని ఒత్తిడితో ఉండే వారు వీక్ ఎండ్ లో ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో హూటల్, రెస్టారెంట్ కి వెళ్లి ఇష్టమైన బిర్యాని తీంటుంటారు. ఈ మధ్య ఆహార భద్రతా విభాగం వారు వరుస దాడుల్లో సంచలన విషయాలు బయటపడుతున్నాయి.

భోజన ప్రియులకు ఇటీవల చేదు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లోని హూటల్స్, రెస్టారెంట్స్‌లో ఆహారం, పాలు కల్తీ జరుగుతున్నట్లు ఆహార భద్రతా విభాగం గుర్తించింది. కొన్ని హూటల్స్, రెస్టారెంట్స్ లో అస్సలు నాణ్యత ప్రమాణాలు పాటించని వారి గుట్టు బట్టబయలు చేసి సదరు యజమానులపై చర్యలు తీసుకుంటున్నార టాస్క్ ఫోర్స్ అధికారులు.ఇప్పటి వరకు పలు హూటళ్లు, రెస్టారెంట్లలో దాడి చేసి నాణ్యతలేని ఆహారాన్ని సీజ్ చేశారు. తాజాగా ఓ హూటల్ కి చెకింగ్ కోసం వెళ్లిన అధికారులకు హూటల్ యజమాని షాకింగ్ ఆన్సర్ ఇవ్వడంతో తెల్లముఖాలు వేసుకోవాల్సి వచ్చింది. ఇంతకీ ఆ హూటల్ లో ఏం జరిగింది అన్న విషయం గురించి తెలుసుకుందాం.. వివరాల్లోకి వెళితే..

గత కొన్నిరోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యతలేని ఆహారం, గడువు దాటిన పదార్థాలు వినియోగిస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్న పలు హూటల్స్, రెస్టారెంట్స్ పై టాస్క్ ఫోర్ కొరఢా ఝులిపిస్తున్నారు. దారుణం ఏంటుంటే గడువు తీరిన పాల ప్యాకెట్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి టీ, కాఫీ చేస్తున్నారు. బూజు పట్టిన మంసాహారంతో బిర్యానీ వండుతున్నారు.. వంట గదుల్లో కనీస నిబంధనలు పాటించకుండా అశుభ్రంగా ఉంచుతున్నారు.అలాంటి వారిపై టాస్క్ ఫోర్స్ సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. ఇప్పటికే పలు హూటల్స్, రెస్టారెంట్స్ లో ఉన్న నాణ్యతలేని ఆహారపదార్థలు సీజ్ చేసి యజమానులపై చర్యలు తీసుకుంటుంది.

ఇదిలా ఉంటే ఆహార భద్రతా విభాగం అధికారులకు ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద రాయల్ గ్రాండ్ రెస్టారెంట్ లో ఓ వ్యక్తి చికెన్ తింటుండగా అందులో బొద్దింక వచ్చింది. వెంటనే సదరు బాధితుడు ఫుడె సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు జయమానికి దీనిపై వివరణ కోరగా ‘ఇంట్లో మీ పెళ్లాం వండిన బిర్యానీలో బొద్దింక రాదా?’ అంటూ దురుసుగా సమాధానం ఇచ్చాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన అధికారలు దీనిపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఓ హూటల్‌లో చికెన్ బిర్యానీలో బల్లి కనిపించడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే.

Show comments