iDreamPost
android-app
ios-app

16 లక్షల కోసం ప్రియుడు దారుణం.. ప్రియురాలిని 20 ముక్కలుగా నరికి..

  • Published Nov 13, 2024 | 4:07 PM Updated Updated Nov 13, 2024 | 4:07 PM

డబ్బు కోసం ప్రియుడు దారుణానికి ఒడిగట్టాడు. 16 లక్షల కోసం లవర్ ను చంపేశాడు. ఆ తర్వాత 20 ముక్కలుగా నరికి పొలంలో పాతిపెట్టాడు. ఈ దారుణ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.

డబ్బు కోసం ప్రియుడు దారుణానికి ఒడిగట్టాడు. 16 లక్షల కోసం లవర్ ను చంపేశాడు. ఆ తర్వాత 20 ముక్కలుగా నరికి పొలంలో పాతిపెట్టాడు. ఈ దారుణ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.

  • Published Nov 13, 2024 | 4:07 PMUpdated Nov 13, 2024 | 4:07 PM
16 లక్షల కోసం ప్రియుడు దారుణం.. ప్రియురాలిని 20 ముక్కలుగా నరికి..

డబ్బు కోసం, ఆస్తుల కోసం సొంత వాళ్లను అంతమొందిస్తున్నారు. ఆస్తి ఇవ్వడం లేదని కొడుకు తండ్రిని, డబ్బు ఇవ్వ లేదని తల్లిని కిరాతకంగా చంపేస్తున్నారు. రోజు రోజుకు ఇలాంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి. నేరాల నియంత్రణకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ అదుపులోకి రావడం లేదు. తాజాగా 16 లక్షల కోసం ఓ ప్రియుడు తన లవర్ ను దారుణంగా అంతమొందించాడు. స్వాతి అనే 30 ఏళ్ల యువతిని.. ఆమె ప్రియుడే అత్యంత దారుణంగా చంపాడు. ప్రియురాలిని ఏకంగా 20 ముక్కలుగా నరికి పొలంలో పాతిపెట్టాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కొమ్ముగూడెంలో చోటుచేసుకుంది.

గతంలో శ్రద్దావాకర్ ను ప్రియుడు హత్య చేసి అనంతరం ముక్కలు చేసిన సంఘటన దేశంలో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత కర్ణాటకాలో ఓ మహిళను 50 ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో ఉంచిన ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఖమ్మంలో జరిగిన ఘటన దేశం నివ్వెరపోయేలా చేస్తున్నది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వీరభద్రం, స్వాతి ఇద్దరు ప్రేమికులు. ఇటీవల వీరు సింగరేణిలో జాబ్ ఇప్పిస్తామంటూ రత్నకుమార్, పార్వతి అనే భార్యభర్తల నుంచి 16 లక్షల రూపాయలు తీసుకున్నారు. డబ్బులు తీసుకున్నాక ముఖం చాటేశారు. వారికి సింగరేణిలో ఉద్యోగం ఇప్పించలేదు. దీంతో మోసపోయామని గ్రహించిన రత్నకుమార్, పార్వతీలు మా డబ్బులు మాకు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.

కానీ వీరభద్రం, స్వాతి డబ్బులు తిరిగి ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారు. డబ్బులు పోయి ఇటు ఉద్యోగం రాక పార్వతి, రత్నకుమార్ మానసిక వేధనకు గురయ్యారు. చేతిలో డబ్బంతా పోవడంతో మానసికంగా కుంగిపోయారు. ఉద్యోగం కోసం తెచ్చిన అప్పులు తీర్చే మార్గం లేక చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈనేపథ్యంలోనే పార్వతి, రత్నకుమార్ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరి మృతితో వీరభద్రం, స్వాతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యుల ఆందోళనతో.. తీసుకున్న 16 లక్షల రూపాయలు తిరిగి ఇస్తానంటూ చెప్పింది స్వాతి. ఈ క్రమంలోనే స్వాతి ఉద్యోగం కోసం తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ వీరభద్రంను ఒత్తిడి చేసింది. డబ్బు విషయంలో ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయి.

దీంతో వీరభద్రం స్వాతిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఆమెను అడ్డుతొలగించుకుంటే 16 లక్షలు తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉండదని భావించి స్వాతిని ఆమె ప్రియుడు వీర భద్రం చంపేశాడు. అనంతరం స్వాతి డెడ్ బాడీని 20 ముక్కలుగా నరికి ఓ గోనెసంచిలో మూట కట్టి ఊరు చివర పొలంలో పాతిపెట్టాడు. కాగా స్వాతి అదృశ్యంపై కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేయగా ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 16 లక్షల కోసం ప్రియురాలిని చంపి ఆ తర్వాత ముక్కలుగా నరికి పొలంలో పాతిపెట్టిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. లవర్ ను చంపి 20 ముక్కలుగా చేసిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom