Revanth Reddy: రైతు భరోసా పథకంపై CM రేవంత్ రెడ్డి కీలక ప్రకటన!

రైతు భరోసా పథకంపై CM రేవంత్ రెడ్డి కీలక ప్రకటన!

Revanth Reddy: గోల్కొండ కోటపై జాతీయ జెండాను తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం పోలీసు సిబ్బంది నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసాపై కీలక ప్రకటన చేశారు.

Revanth Reddy: గోల్కొండ కోటపై జాతీయ జెండాను తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం పోలీసు సిబ్బంది నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసాపై కీలక ప్రకటన చేశారు.

దేశమంతా పంద్రాగస్టు వేడుకల్లో మునిగారు. ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరేశారు. అంతేకాక జాతినుద్దేశించి.. ఆయన ప్రసగించారు. ఇది ఇలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గోల్కొండ కోటపై సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగరేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రసంగం చేశారు. అంతేకాక రైతు భరోసా పథకంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

గోల్కొండ కోటపై జాతీయ జెండాను తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించిన అనంతరం పోలీసు సిబ్బంది నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ.. “ప్రపంచ చరిత్రలోనే అహింసనే ఆయుధంగా మలిచి చేసిన మహా సంగ్రామం మన స్వాతంత్ర్య పోరాటం. ఇటీవల అమెరికా పర్యటనలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశం అయ్యాం. తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు అంగీకరించింది. గత ప్రభుత్వం మాదిరిగా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ప్రజల నెత్తిన భారం వేయం” అని తెలిపారు.

ఈ సందర్భంగా రైతు భరోసా గురించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అర్హులైన అందరికీ త్వరలో రైతు భరోసా అందిస్తామని సీఎం అన్నారు. గత ప్రభుత్వం అనర్హులకు రైతు బంధు ఇచ్చిందన్నారు. త్వరలో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించబోతున్నామని సీఎం తెలిపారు. అదే విధంగా సన్నరకం వరి సాగును ప్రోత్సహించేందుకు రూ.500 బోనస్‌ చెల్లిస్తామని, దీని కోసం 33 రకాల వరి ధాన్యాలను గుర్తించామన్నారు. పెండింగ్‌ ధరణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి సమగ్ర చట్టం తీసుకురావాలని భావిస్తున్నామన్నారు.

అంతేకాక వరంగల్‌ డిక్లరేషన్‌ గురించి కూడా ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. వరంగల్ డిక్లరేషన్ ను అమలులో భాగంగా రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. రుణమాఫీ అసాధ్యమని అన్న కూడా రూ.2 లక్షల వరకు అమలు చేసి చూపిస్తున్నామని సీఎం అన్నారు. సాంకేతిక కారణాలతో కొందరికి రుణమాఫీ కావడం లేదని, అలాంటి వారిని గుర్తించి అందజేస్తామని తెలిపారు.  ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండు ఇప్పటికే అమలు చేశామని, ఆరోగ్యశ్రీ పథకానికి పూర్వ వైభవం తెచ్చామని సీఎం అన్నారు. మొత్తంగా అనేక విషయాలను ప్రస్తావిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం సాగింది. మరి.. సీఎం స్పీచ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments