CM Revanth Reddy: తెలంగాణ హైకోర్టుకు కొత్త భవనం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

తెలంగాణలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రగతి భవన్‌ పేరు మార్చగా.. తాజాగా హైకోర్టు భవనానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. ఆ వివరాలు..

తెలంగాణలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రగతి భవన్‌ పేరు మార్చగా.. తాజాగా హైకోర్టు భవనానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. ఆ వివరాలు..

తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాం‍గ్రెస్‌ ప్రభుత్వం.. దూకుడుగా ముందుకు వెళ్తుంది. ఇప్పటికే ప్రగతి భవన్‌ పేరు మార్చడమే కాక.. అక్కడ ప్రతి శుక్రవారం ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా దర్బార్‌ నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసింది సంగతి తెలిసిందే. అలానే ప్రగతి భవన్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేటాయించారు. ఇదిలా ఉండగా తాజాగా హైకోర్టు భవనానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త భవనాన్ని నిర్మించేందుకువ రెడీ అవుతున్నారు. ఆ వివరాలు..

తెలంగాణ హైకోర్టుకు కొత్త భవనాన్ని నిర్మించేందుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వచ్చే జనవరిలోనే తెలంగాణ హైకోర్ట్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలంటూ అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోకో ఆరాధే, ప్రభుత్వ ముఖ్య అధికారులతో గురువారం నాడు హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో సంబంధిత అంశంపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుత హైకోర్టు భవనం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో కొత్త బిల్డింగ్‌ నిర్మించాల్సిన అవశ్యకతను చీఫ్ జస్టిస్, న్యాయవాదులు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాక కొత్త భవనం కోసం రాజేంద్రనగర్ పరిధిలో 100 ఎకరాలు కేటాయించి, నిధులను మంజూరు చేయాలని సీఎంను కోరారు. ఇక చీఫ్ జస్టిస్, న్యాయవాదుల విజ్ఞప్తికి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. సంబంధిత ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలుజారీ చేశారు. వచ్చే ఏడాది జనవరిలో హైకోర్టు కొత్త భవనానికి శంకుస్థాపన చేయడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు.

అదే విధంగా కొత్త జిల్లాల్లో కోర్టు కాంప్లెక్స్‌ల నిర్మాణానికి కూడా చొరవ చూపాలని చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధేతో పాటు మిగిలిన న్యాయవాదులు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. అయితే.. ఇప్పుడున్న హైకోర్టు భవనం.. వారసత్వ సంపదల్లో ఒకటి కాబట్టి దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆ భవనాన్ని ఆధునికీకరణ చేసి సిటీ కోర్టుకు లేదా ఇతర కోర్టు భవనాలకు వినియోగించుకునేలా చూస్తామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Show comments