iDreamPost
android-app
ios-app

HYDలో కొత్త రైల్వే స్టేషన్ ప్రారంభం..సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

  • Published Sep 14, 2024 | 11:00 AM Updated Updated Sep 14, 2024 | 11:00 AM

Hyderabad: హైదరాబాద్‌ నగరంలో నాలుగో రైల్వేస్టేషన్‌గా చర్లపల్లి ఇప్పటికే సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ పనులు ముగింపు దశకు వచ్చేసిన విషయం తెలిసిందే. పైగా త్వరలోనే స్టేషన్ ప్రారంభం కూడా కానుండగా.. తాజాగా ఈ విషయంపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

Hyderabad: హైదరాబాద్‌ నగరంలో నాలుగో రైల్వేస్టేషన్‌గా చర్లపల్లి ఇప్పటికే సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ పనులు ముగింపు దశకు వచ్చేసిన విషయం తెలిసిందే. పైగా త్వరలోనే స్టేషన్ ప్రారంభం కూడా కానుండగా.. తాజాగా ఈ విషయంపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

  • Published Sep 14, 2024 | 11:00 AMUpdated Sep 14, 2024 | 11:00 AM
HYDలో కొత్త రైల్వే స్టేషన్ ప్రారంభం..సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

ఇప్పటికే దేశంలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద..  చిన్న చిన్న రైల్వే స్టేషన్లను మెరుగుపరచడబ, కొత్త రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం వంటివి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రయాణీకుల మౌలిక సౌకర్యల మేరకు చిన్న చిన్న రైల్వే స్టేషన్లను మెరుగుపరుస్తున్నాయి. మరోవైపు కొత్తు రైల్వే స్టేషన్ల నిర్మాణాలను కూడా చేపడుతున్నాయి. అయితే ఇప్పటికే హైదరాబాద్ నగరంలో నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ స్టేషన్లతో పాటు 21 రైల్వే స్టేషన్లను ఆధునికీకరించి పనిలో ప్రభుత్వం ఉన్నా విషయం తెలిసిదే. ఇందులో భాగంగానే నగరం శివార్లలోని చర్లపల్లి రైల్వే స్టేషన్ ను నిర్మిస్తుండగా.. ఆ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. పైగా త్వరలోనే స్టేషన్ ప్రారంభం కూడా కానుండగా.. తాజాగా ఈ విషయంపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

హైదరాబాద్‌ నగరానికి నాలుగో రైల్వేస్టేషన్‌గా చర్లపల్లి ఇప్పటికే సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అయితే  దీనిని సుమారు రూ..415 కోట్ల పెట్టుబడితో కేంద్రం కొత్త రైల్వే టెర్మినల్ నిర్మిస్తోంది.  అయితే ఇక్కడ ప్యాసింజర్, గూడ్స్ ట్రైన్ల సేవలందించేకు గాను అత్యాధునిక సౌకర్యాలతో ఈ టెర్మినల్ నిర్మిస్తుంటగా.. పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇకపోతే త్వరలోనే చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం కూడా కానుంది. కానీ, తాజాగా ఈ విషయం పై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు నాలుగు రోజుల క్రితం కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈ టర్మినల్ విషయంపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.

అయితే ఆ లేఖలో చర్లపల్లి రైల్వే టెర్మినల్స్ కోసం రోడ్ల విస్తరణ పనులకు సహకారం అందించాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇక ఈ లేఖపై స్పందించిన సీఎం రేవంత్ రాష్ట్రంలోని అధికారులకు కీలక ఆదేశాలాలు జారీ చేశారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరిస్తున్నందున..  ఆ స్టేషన్ ముందు పార్కింగ్, పరిసర ప్రాంతాల నుంచి స్టేషన్‌కు చేరుకునే అప్రోచ్ రోడ్లను అభివృద్ధి చేయాలన్నారు. దీంతో పాటు పరిసరాల్లో ఉన్న అటవీ శాఖ భూమిని, పరిశ్రమల విభాగం భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని చెప్పారు. అక్కడున్న పరిశ్రమలను మరో చోటికి తరలించాలని అధికారులకు సర్కార్ సూచించారు.

ఇకపోతే ఈ రైల్వే స్టేషన్ ను 9 ప్లాట్‌ఫామ్‌లు కూడా అందుబాటులోకి రానున్నాయి. అలాగే ఈ రైల్వే స్టేషన్ లో  12 మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించగా, మరొకటి 6 మీటర్ల వెడల్పుతో నిర్మించారు.  వీటితో పాటు 7 లిఫ్టులు, 6 ఎస్కలేటర్లను కూడా నిర్మించారు. అయితే ఈ స్టేషన్ నుంచి ట్రైన్లు అందుబాటులోకి వస్తే రైళ్ల ఆలస్యానికి చెక్ పడనుంది. దీంతో పాటు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌తో సంబంధం లేకుండా ట్రైన్ ప్రయాణాలు నేరుగా సాగనున్నాయి. అలాగే  భవిష్యత్తులో లింగంపల్లి తర్వాత హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్‌లో ఈ ట్రైన్లు ఆగి సనత్‌నగర్‌ – మౌలాలి మీదుగా చర్లపల్లి చేరుకునే వెసులుబాటు కలగనుంది.  మరీ, చర్లపల్లి రైల్వే స్టేషన్  ప్రారంభం విషయంలో సీఎం రేవంత్ జారీన ఆదేశాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.