iDreamPost
android-app
ios-app

రైతులను ఇబ్బందికి పెట్టవొద్దు.. బ్యాంకు అధికారులకు సీఎం కీలక విజ్ఞప్తి!

  • Published Apr 24, 2024 | 10:17 AM Updated Updated Apr 24, 2024 | 10:17 AM

CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది.

CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది.

  • Published Apr 24, 2024 | 10:17 AMUpdated Apr 24, 2024 | 10:17 AM
రైతులను ఇబ్బందికి పెట్టవొద్దు..  బ్యాంకు అధికారులకు సీఎం కీలక విజ్ఞప్తి!

గత ఏడాది చివర్లోల తెలంగాన అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. పదేళ్ళ బీఆర్ఎస్ పాలనకు చెక్ పెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలతో ప్రజల్లోకి వెళ్లింది. తెలంగాణ ప్రజలు ఆరు గ్యారెంటీల పథకాలను నమ్మి కాంగ్రెస్ కి పట్టం కట్టారు. సీఎం గా రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే మొదట ఆరు గ్యారెంటీ పథకాలపై తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే మహలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు ప్రారంభించారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా  సీఎం రేవంత్ రెడ్డి రైతులకు సంబంధించిన రుణ మాఫీ విషయంపై శుభవార్త అందించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారాలతో దుమ్మురేపుతున్నారు. ఎలాగైనా ఈసారి లోక్ సభలో తమ సత్తా చాటాలని బీఆర్ఎస్ గట్టి పట్టుమీద ఉంది. మరోవైపు ఈ ఎన్నికల్లో కూడా  ప్రజలకు తమకే  పట్టం కడతారని అధికార పార్టీ గట్టి నమ్మకంతో ఉంది. ఇప్పటికే అధికార పార్టీ తాము ఇచ్చిన హామీల్లో రెండు ప్రారంభించామని.. మితగా పథకాలు కూడా త్వరలో ప్రారంభిస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్ట్ 15 లోపల రైతులకు 2 లక్షల రుణమాఫీ తమ ప్రభుత్వం చేస్తుందని రేవంత్ రెడ్డి ప్రచార సభలో మాట్లాడారు.

బాసర సరస్వతి మందిరం మీద ఒట్టేసి చెబుతున్నా.. పంద్రాగస్టు వరకు రైతులకు రెండు లక్షల రుణ మాఫీ చేసి ప్రతిపక్షాల నోళ్లు మూయిస్తాం అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొంతమంది బ్యాంక్ అధికారులు రైతులను అప్పులు కట్టాలని తీవ్ర ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తుంది. తమ ప్రభుత్వ హయాంలో ఏ రైతుని బ్యాంక్ అధికారులు ఇబ్బంది పెడితో సహించేది లేదని అన్నారు.  రైతు తరుపున మాదీ జిమ్మేదార్. మీ బ్యాంకు అప్పులు మొత్తం ఆగస్టు 15 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తుంది. అప్పటి వరకు బ్యాంకు అధికారులు రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవొద్దని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.