iDreamPost
android-app
ios-app

Revanth Reddy: మాట నిలబెట్టుకున్న CM రేవంత్.. రజినీకి ఉద్యోగ నియామక పత్రం

  • Published Dec 07, 2023 | 2:39 PM Updated Updated Dec 07, 2023 | 2:46 PM

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి.. గతంలో తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. వేదికగ మీదుగానే ఓ దివ్యాంగురాలికి ఉద్యోగ నియామక పత్రం అందజేశారు. ఆ వివరాలు..

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి.. గతంలో తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. వేదికగ మీదుగానే ఓ దివ్యాంగురాలికి ఉద్యోగ నియామక పత్రం అందజేశారు. ఆ వివరాలు..

  • Published Dec 07, 2023 | 2:39 PMUpdated Dec 07, 2023 | 2:46 PM
Revanth Reddy: మాట నిలబెట్టుకున్న CM రేవంత్.. రజినీకి ఉద్యోగ నియామక పత్రం

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. మెుట్టమెుదటి ఉద్యోగం దివ్యాంగురాలు రజినీకి ఇస్తామంటూ గతంలో ఇచ్చిన మాటను నేడు నిలబెట్టుకున్నారు. ప్రమాణ స్వీకార వేదిక మీదనే.. దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగ నియామక పత్రం అందజేశారు. ముందుగా ఆరు గ్యారెంటీల పథకం మీద సంతకం చేసిన రేవంత్.. ఆ వెంటనే రజనీ ఉద్యోగ నియామక పత్రం మీద సైన్ చేసి.. ఆమెకి అందజేశారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం రజినీకే ఇస్తామని ఈ ఏడాది అక్టోబరు‌లో రేవంత్ రెడ్డి అభయ హస్తం అందించారు. నేడు సీఎంగా బాధ్యతలు స్వీకరించాగానే ఆ మాట నిలబెట్టుకున్నారు రేవంత్. రజనీని వేదిక మీదకు ఆహ్వానించి.. శాలువాతో సత్కరించారు. ఆ తర్వాత వెంటనే ఆమెకు ఉద్యోగ నియామక పత్రం అందజేశారు రేవంత్.

పీజీ పూర్తి చేసినా కూడా అటు ప్రైవేటులో, ఇటు ప్రభుత్వంలో ఎక్కడా ఉద్యోగం రాలేదంటూ హైదరాబాద్ నాంపల్లికి చెందిన దివ్యాంగురాలు రజినీ.. గతంలో రేవంత్ రెడ్డిని కలిసిన సందర్భంలో ఆవేదనను వ్యక్తం చేశారు. ఆమె బాధను అర్థం చేసుకున్న రేవంత్ రెడ్డి.. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని.. ఆ సభకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే వస్తారని చెప్పుకొచ్చారు. అదే రోజున, వాళ్ల ముందే.. అదే వేదిక మీద కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి ఉద్యోగం రజనీకే ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇది తన గ్యారంటీ అని రేవంత్ స్పష్టం చేయటంతో పాటు స్వయంగా కాంగ్రెస్ గ్యారంటీ కార్డును రజినీ పేరుతో రాసి ఇచ్చారు.

దానిలో భాగంగా నేడు జరిగిన ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి రజనీని ప్రత్యేకంగా ఆహ్వానించారు. అలానే నాడు ఇచ్చిన మాటను.. సీఎంగా ప్రమాణ స్వీకారం పూర్తి చేసిన వెంటనే నిలబెట్టుకున్నారు రేవంత్. రజినీకి ఉద్యోగ నియామక పత్రం అందజేయడంతో.. ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ’’తెలంగాణ ఎన్నో త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రం.. ఈ ప్రభుత్వ ఏర్పాటుతో తెలంగాణ మొత్తం అభివృద్ది చెందుతుంది.. ప్రగతిభవన్ చుట్టు ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టించా.. పదేళ్ల బాధలను ప్రజలు మౌనంగా భరించారు.. గత ప్రభుత్వం ప్రజల బాధలు పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు వెల్లివిరిసేలా చూస్తామని‘‘ చెప్పుకొచ్చారు.