iDreamPost
android-app
ios-app

CM రేవంత్‌ గుడ్‌ న్యూస్‌.. సింగరేణిలో ఉద్యోగాలు.. వారికి ఇక పండగే

  • Published Feb 08, 2024 | 9:41 AM Updated Updated Feb 08, 2024 | 9:41 AM

Revanth Reddy-Singareni Jobs: సింగరేణిలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవత్‌ కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు..

Revanth Reddy-Singareni Jobs: సింగరేణిలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవత్‌ కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు..

  • Published Feb 08, 2024 | 9:41 AMUpdated Feb 08, 2024 | 9:41 AM
CM రేవంత్‌ గుడ్‌ న్యూస్‌.. సింగరేణిలో ఉద్యోగాలు.. వారికి ఇక పండగే

తమను గెలిపిస్తే.. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక అధికారంలోకి వచ్చిన నాటి నుంచి.. ఆ దిశగా కార్యచరణ రూపిందిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే టీఎస్‌పీఎస్‌సీ బోర్డలో ప్రక్షాళన మొదలు పెట్టారు. కొత్త డైరెక్టర్‌గా మాజీ డీజీపీ మహేందర్‌ రెడ్డిని నియమించారు. ఇక త్వరలోనే మిగతా సభ్యుల నియామకం పూర్తి అవుతుందని తెలిపారు. అలానే ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం.. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. తాజాగా సీఎం రేవంత్‌ రెడ్డి​ కీలక ప్రకటన చేశారు.

తెలంగాణలోని నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. రానున్న 15 రోజుల్లోగా.. 15 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆయన వెల్లడించారు. అలానే 60 కొత్త పోస్టులతో గ్రూప్ -1 రీనోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు. రాష్టంలోని 30 లక్షల నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి సూచించారు. తమ ప్రభుత్వం ఉద్యోగాల నియామకాల కోసం అన్నిరకాల ప్రయత్నాలు మొదలుపెట్టిందని వెల్లడించారు. పదేండ్ల పాలనలో నిర్లక్ష్యానికి గురై, వ్యవస్థపై విశ్వాసం కోల్పోయిన 32 లక్షల మంది నిరుద్యోగుల్లో తిరిగి నమ్మకం కలిగించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు..

అంతేకాక గత ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన సింగరేణి సంస్థను అన్ని రకాలుగా ఆదుకుంటామని ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు. సింగరేణిలో ఉద్యోగాలకు ఎంపికైన మొత్తం 441 మందికి హైదరాబాద్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం రేవంత్ నియామక పత్రాలను అందజేశారు. వీరిలో 412 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగ నియామక పత్రాలు అందివ్వగా.. మరో 29 మందికి ఉద్యోగ నియామకాల పత్రాలను అందజేశారు.

ఈ 441 మందిలో బ‌దిలీ వర్కర్లు, జూనియ‌ర్ అసిస్టెంట్లు, మోటారు మెకానిక్‌లు ఉన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనంగా, అంబేద్కర్ విగ్రహ సాక్షిగా నియామకాల పత్రాలను అందజేస్తున్నామని సీఎం రేవంత్‌ ఈ సందర్భంగా తెలిపారు. అంతేకాక తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికుల పాత్రను ఎవరూ తగ్గించలేరని ఆయన స్పష్టం చేశారు. పార్టీలు తెలంగాణ సాదనలో వైఫల్యం చెందినా కార్మికులు రాష్ట్రం కోసం అనేక పోరాటాలు చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు.

అంతేకాక సింగరేణి సంస్థలో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ఇటివలే తమ ప్రభుత్వం ఆదేశించినట్లుగా సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. సింగరేణి ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించే అంశంపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కారుణ్య నియామకాల వయస్సు సడలింపు అంశాన్ని కూడా పరిశీలిస్తామని ఈ సందర్బంగా సీఎం రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు.