iDreamPost
android-app
ios-app

Revanth Reddy: ట్రాఫిక్‌లో ఇరుక్కున్న CM రేవంత్ రెడ్డి.. ఆయన కొత్త కాన్వాయ్ నంబర్ ఇదే

  • Published Dec 10, 2023 | 12:35 PM Updated Updated Dec 10, 2023 | 1:11 PM

సాధారణంగా ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు రోడ్డు మీదకు వస్తే.. ట్రాఫిక్ ను ఆపి.. వారు వెళ్లడానికి మార్గం సుగమం చేస్తారు. కానీ తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అసెంబ్లీకి వెళ్తుండగా.. ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. ఆ వివరాలు..

సాధారణంగా ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు రోడ్డు మీదకు వస్తే.. ట్రాఫిక్ ను ఆపి.. వారు వెళ్లడానికి మార్గం సుగమం చేస్తారు. కానీ తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అసెంబ్లీకి వెళ్తుండగా.. ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. ఆ వివరాలు..

  • Published Dec 10, 2023 | 12:35 PMUpdated Dec 10, 2023 | 1:11 PM
Revanth Reddy: ట్రాఫిక్‌లో ఇరుక్కున్న CM రేవంత్ రెడ్డి.. ఆయన కొత్త కాన్వాయ్ నంబర్ ఇదే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శనివారం నాడు శాఖలు కేటాయించారు. అలానే డిసెంబర్ 9న అనగా శనివారం నాడు.. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల ప్రారంభం అయ్యాయి. ఇక తొలి రోజు సమావేశాలకు బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి.. ట్రాఫిక్‌ కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా రేవంత్ రెడ్డి తన కొత్త కాన్వాయ్‌లో అసెంబ్లీ సమావేశానికి హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన కాన్వాయ్ ట్రాఫిక్ లో చిక్కుకుంది.

ప్రోటోకాల్ ప్రకారం.. సాధారణంగా ముఖ్యమంత్రి కాన్వాయ్ వస్తుందంటే.. కనీసం 5 నిమిషాల ముందు ఆ దారిలో ట్రాఫిక్ ను నిలిపివేస్తారు. కాన్వాయ్ ప్రయాణించే మార్గంలో అక్కడక్కడా కానిస్టేబుళ్లను ముందుగానే నియమిస్తారు. ఇతర లింకు రోడ్ల నుంచి సీఎం వెళ్లే మార్గంలోకి ట్రాఫిక్ రాకుండా చూసుకోవడం వారి బాధ్యత. అయితే, శనివారం సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ గాంధీ భవన్ నుంచి అసెంబ్లీ వైపుగా వెళ్తుండగా మాత్రం ప్రోటోకాల్ పాటించలేదు. దాంతో ఆయన ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మాత్రమే కాక దీనిపై విమర్శలు కూడా వస్తున్నాయి.

సీఎం వెళ్లే మార్గంలో ట్రాఫిక్‌ సమస్య తలెత్తడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇది ట్రాఫిక్ పోలీసుల మధ్య సమన్వయ లోపమా.. లేక ఇంకేవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలుసుకుని బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది.

అధికారులు వాదన ఇలా ఉండగా.. కాంగ్రెస్ నేతలు మాత్రం మరోలా ప్రచారం చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి తాను ప్రజల మనిషిని అనే విషయం మర్చిపోలేదని.. ప్రజలతో కలిసి పోవడమే ఆయనకు ఇష్టమని.. దానిలో భాగంగానే.. జనంతో కలిసి పోతున్నారని అంటున్నారు. ప్రజా భవన్ లో ప్రజా దర్బార్‌ నిర్వహించి ప్రజలకు తాను ఉన్నానని భరోసా ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. శనివారం అసెంబ్లీకి కూడా ప్రజల మధ్యలోనే కలిసి వెళ్లారని చెప్పుకొస్తున్నారు. అందుకే ఆయన కాన్వాయ్ గాంధీ భవన్‌ నుంచి అసెంబ్లీ వరకు ట్రాఫిక్‌ మధ్యలోనే సాగిందని చెబుతున్నారు.

సీఎం కొత్త కాన్వాయ్ నంబర్ ఇదే..

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికొ కొత్త కాన్వాయ్ ఏర్పాటు చేశారు. అలానే కాన్వాయ్‌లోని కార్లకు 0009 నంబరు కేటాయించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తొలిసారిగా.. ఈ కొత్త కాన్వాయ్‌లో అసెంబ్లీ సమావేశానికి హాజరయ్యారు. అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కాన్వాయ్ లో కార్లకు నాలుగు ఆర్లు (6666) ఉండేవి. భద్రతా కారణాల రీత్యా సీఎం వాహన శ్రేణిలోని అన్ని కార్లకు ఇదే నెంబరు ఉంటుంది.