iDreamPost
android-app
ios-app

అక్బరుద్దీన్.. నీకు హిందువులు కూడా ఓటు వేస్తేనే గెలిచావు: CM రేవంత్ రెడ్డి!

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి తరువాత తొలిసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మాటల యుద్దం సాగుతోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి, అక్బరుద్దీన్ మాటల యుద్ధం సాగింది. ఈ సందర్భంగా సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి తరువాత తొలిసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మాటల యుద్దం సాగుతోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి, అక్బరుద్దీన్ మాటల యుద్ధం సాగింది. ఈ సందర్భంగా సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు.

అక్బరుద్దీన్.. నీకు హిందువులు కూడా ఓటు వేస్తేనే గెలిచావు: CM రేవంత్ రెడ్డి!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎంపికయ్యారు. ఇక అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి..ప్రగతి భవన్ గేట్లు తొలగించడం మొదలు అనేక సంచలన నిర్ణయాలను సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారు. ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత గత నాలుగు రోజుల నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్ల అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. నిన్న మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డిలకు, హరీష్,కేటీర్ ల మధ్య మాటల యుద్ధం జరిగింది. తాజాగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కి సీఎం రేవంత్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి  ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దిన్ ఓవైసీకి మధ్య మాటల యుద్ధం సాగింది. గత వారం రోజుల నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. హారీష్ రావు, కేటీఆర్ లతో మంత్రులకు మాటల  వార్ నడిచింది. బుధవారం సైతం కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావులు పరస్పరం విమర్శించుకున్నారు. తిరిగి గురువారం ప్రారంభమైన సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి, చాంద్రయాణ గుడ్డ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి మధ్య వార్ నడిచింది.

పాతబస్తీ అభివృద్ధికి సంబంధించిన అంశం అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..నీకు హిందువులు కూడా ఓటేస్తేనే గెలిచావు అక్బరుద్దీన్ అంటూ ఫైర్ అయ్యారు. అంతేకాక పాతబస్తీలో గెలిచిన ఏడుగ్గురు ఎమ్మెల్యేలకు హిందువులు ఓటు వేయలేదా? అంటూ సీఎం ప్రశ్నించారు. అలా హిందువు, ముస్లిం అందరు ఓటేస్తేనే.. అసెంబ్లీలో అడుగుపెట్టామని ఆయన తెలిపారు. ఇక్కడ ఉన్న వాళ్లం 4 కోట్ల తెలంగాణ ప్రజలకు రిప్రజెటీవులమని సీఎం చెప్పుకొచ్చారు. అంతేకాక మాకు ఓల్డ్ సిటీ, న్యూ సిటీ అంటూ బేధాలు ఏమిలేవని అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.

ఇక అక్బరుద్దీన్ కేవలం ఎంఐఎం పార్టీకి మాత్రమే నాయకుడని, ముస్లిం సమాజానికి నాయకుడు కాదని రేవంత్ అన్నారు. అంతేకాక జూబ్లిహిల్స్ లో మైనార్టీకి అజారుద్దిన్ కి  కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని తెలిపారు. కానీ తోటి ముస్లింను ఓడించేందుకు ఎంఐఎం పార్టీ, అక్బరుద్దీని ఓవైసీ ప్రయత్నం చేశారని, అందుకే వాళ్లు బీఆర్ఎస్ ఒప్పందం చేసుకున్నారని సీఎం ఆరోపించారు.. పాతబస్తీ ప్రాంతంలో గెలిచిన కొందరు ఎమ్మెల్యే హిందువులూ ఓట్లే గెలిచారని సీఎం చెప్పుకొచ్చారు. ఇలానే కామారెడ్డిలో షబ్బీర్ అలీని ఓడిచేందుకు కేసీఆర్ తో ఎంఐఎం నేతలు సిద్ధమయ్యారు. అందుకే తాను కేసీఆర్ కి పోటీగా కామారెడ్డి నుంచి బరిలో నిలబడ్డాని తెలిపారు. మరి.. గురువారం తెలంగాణ అసెంబ్లీలో అక్బరుద్దిన్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి