iDreamPost
android-app
ios-app

Revanth Reddy: అలర్ట్‌.. వారికి మాత్రమే రుణమాఫీ, రైతు భరోసా.. మీ పేరుందో లేదో చెక్‌ చేసుకొండి

  • Published Jun 22, 2024 | 12:44 PMUpdated Jun 22, 2024 | 12:44 PM

తెలంగాణ రైతులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోన్న రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాల అమలకు సంబంధించి రేవంత్‌ సర్కార్‌.. కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

తెలంగాణ రైతులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోన్న రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాల అమలకు సంబంధించి రేవంత్‌ సర్కార్‌.. కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

  • Published Jun 22, 2024 | 12:44 PMUpdated Jun 22, 2024 | 12:44 PM
Revanth Reddy: అలర్ట్‌.. వారికి మాత్రమే రుణమాఫీ, రైతు భరోసా.. మీ పేరుందో లేదో చెక్‌ చేసుకొండి

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఎన్నికల వేళ తమను గెలిపిస్తే.. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని.. అలానే ఎకరానికి ఏడాదికి 15 వేల రూపాయల పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించింది. అన్నట్లుగానే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ హామీలన్నింటిని అమలు చేస్తుంది. ఇక అన్నదాతలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోన్న 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ, రైతు భరోసా నిధుల విడుదల హామీ అమలుకు సర్వం సిద్ధం అయ్యింది. శుక్రవారం నాడు నిర్వహించి కేబినెట్‌ భేటీలో ఈ రెండు హామీల అమలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో రైతు రుణమాఫీకి సంబంధించి విధివిధానాలు వెల్లడించారు.

ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో అది కూడా రెండు విడతలుగా కేవలం 28 వేల కోట్ల రూపాయలు మాత్రమే మాఫీ చేసింది. కానీ మా ప్రభుత్వం మాత్రం ఏకకాలంలో ఒకేసారి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చాం.. దానికే కట్టుబడి ఉన్నాం. రైతు రుణమాఫీ చేయడానికి 31 వేల కోట్లు అవసరం అవుతాయి. బ్యాంకుల వద్ద నుంచి రైతుల వివరాలు తీసుకున్నాం. అయితే 2023, డిసెంబర్‌ 9వ తేదీ లోపు తీసుకున్న రైతుల రుణాలు మాత్రమే మాఫీ చేస్తాం. ఆ తర్వాత అనగా డిసెంబర్‌ 10, 2023 తర్వాత తీసుకున్న వారి రుణాలు మాఫీ కావు’’ అని తెలిపారు.

అలానే రైతు భరోసా అమలుకు సంబందించిన పలు వర్గాల సూచనలతో పాటు, విధివిధానాలు రూపొందించే పనిలో ఉన్నాము అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పుకొచ్చారు. రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘం వేశామని.. జూలై 15 నాటికి ఇది నివేదిక అందజేస్తుంది అన్నారు. రైతు భరోసాని ఎంతో పారదర్శకంగా అమలు చేయాలని నిర్ణయించామని.. అర్హులైన ప్రతి ఒక్కరికీ రైతు భరోసా అందిస్తామని తెలిపారు. ఈ మంత్రివర్గ ఉపసంఘంలో ప్రభుత్వ అధికార ప్రతినిధులుగా శ్రీధర్‌ బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇద్దు మంత్రులు ఉన్నారని చెప్పుకొచ్చారు. జూలై 15 తర్వాత రైతు భరోసా మార్గదర్శకాలు, అర్హులకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామన్నారు.

ఆగస్టు 15 నాటికి 2 లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేస్తామని.. ఇప్పటికే అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక రుణమాఫీ కోసు సుమారు 39 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని.. ప్రభుత్వం ఆ నిధుల సమీకరణపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి