రైతుబంధుకు పరిమితి.. కొత్త రేషన్ కార్టుల జారీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన

CM Revanth Reddy: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుకు రంగం సిద్ధం అయ్యింది. ప్రజాపాలన కార్యక్రమంలో దీనికి సంబంధించిన దరఖాస్తులు తీసుకోనున్నారు. ఈ క్రమంలో కొత్త రేషన్ కార్డులు, రైతుబంధు పరిమితిపై రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు..

CM Revanth Reddy: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుకు రంగం సిద్ధం అయ్యింది. ప్రజాపాలన కార్యక్రమంలో దీనికి సంబంధించిన దరఖాస్తులు తీసుకోనున్నారు. ఈ క్రమంలో కొత్త రేషన్ కార్డులు, రైతుబంధు పరిమితిపై రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఆరు గ్యారెంటీల అమలుకు రంగం సిద్ధం చేస్తోంది. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన కార్యక్రమం ద్వారా.. ప్రజల నుంచి ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించనున్నారు. పది రోజుల పాటు అనగా జనవరి 6, 2024 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ క్రమంలో బుధవారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రజాపాలన దరఖాస్తు ఫారమ్ విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు ఒక్కటే అప్లికేషన్ ఫామ్ ని రూపొందించారు.

అయితే సర్కారు అందించే ఆరు గ్యారెంటీలు పొందాలంటే.. కచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి. రాష్ట్రంలో సుమారు 9 ఏళ్ల నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ చేయలేదు. లక్షల్లో దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఆరు గ్యారెంటీలు పొందాలంటే రేషన్ కార్డు కచ్చితంగా ఉండాలి అంటున్నారు. దాంతో చాలా మందిలో అనేక అనుమానాలున్నాయి. అలానే రైతుబంధు కార్యక్రమానికి సంబంధించి.. భూపరిమితి విధిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు ఆ వివరాలు..

సంక్షేమ పాలనే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని.. పట్టణాల నుంచి తండాల వరకు అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రేపటి నుంచి జనవరి 6 వరకు ఆరు గ్యారంటీలకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా.. అధికారులే ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని.. వాటిని పరిష్కరిస్తారని వెల్లడించారు. జనవరి 6 తర్వాత కూడా గ్రామ పంచాయితీలు, ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని వెల్లడించారు.

ఈ సందర్భంగా రైతుబంధు పరిమితిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎక్కువ భూమి కలిగిన భూ స్వాములకు రైతుబంధు నిధులు ఇవ్వటం సరైంది కాదనే వాదన ఎప్పటి నుంచో ఉంది. తాజాగా ఈ విషయం గురించి మీడియా ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. అందుకు ఆయన బదులిస్తూ.. ప్రస్తుతానికి రైతుబంధుకు ఎలాంటి పరిమితి లేదని చెప్పారు. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

అన్ని రాజకీయ పార్టలతో చర్చించిన తర్వాతనే రైతుబంధు పరిమితిపై నిర్ణయాన్ని ప్రకటిస్తామని రేవంత్ అన్నారు. అలానే కొత్త రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర పక్రియ అని.. అర్హులందరికీ త్వరలోనే కార్డులు జారీ చేస్తామని తెలిపారు. ప్రత్యేక కౌంటర్ల ద్వారా రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా.. ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు.

Show comments