P Krishna
మొన్నటి వరకు తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నిల జోరు కొనసాగింది. త్వరలో పంచాయతీరాజ్ ఎన్నికలు జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో మరోసారి అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటీకి సిద్దమవుతున్నాయి.
మొన్నటి వరకు తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నిల జోరు కొనసాగింది. త్వరలో పంచాయతీరాజ్ ఎన్నికలు జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో మరోసారి అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటీకి సిద్దమవుతున్నాయి.
P Krishna
తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి తనదైన మార్క్ చాటుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి అన్ని రకాలుగా సిద్దమవుతున్నారు. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు ప్రారంభించారు. ప్రగతి భవన్ ని ప్రజా భవన్ గా మార్చారు. గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్షలు చేస్తున్నారు. త్వరలో తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీతో పాటు ప్రతి పక్ష పార్టీలు కూడా సిద్దమవుతున్నాయి. అయితే పంచాయతీ ఎన్నికలు కులగణన తర్వాత నిర్వహించాలని బీసీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయాన్ని బీసీ సంఘాల నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశాయా. ఈ సందర్భంగా ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో ఈ మద్యనే అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్ ఘన విజయం సాధించి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎం గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. తెలంగాణలో త్వరలో పంచాయతీ ఎన్నికల జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో సమగ్ర బీసీ కులగణన నిర్వహించిన తర్వాత పంచాతీ ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ తో పాటు పలువురు బీసీ సంఘాల నేతలు, కుట సంఘాల నేతలు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందకు అభినందనలు తెలుపారు. బీసీ రిజర్వేషన్స్ 42 శాంతానికి పెంచాలని, విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజ్ రియింబర్స్ మెంట్ అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం కి విజ్ఞప్తి చేశారు.
బీసీ సంఘం జాతీ అధ్యక్షులు, ఇతర కుల సంఘాల నేతల విజ్ఞప్తిపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఇటీవల కామారెడ్డిలో జరిగిన బీసీ డిక్లరేషన్ సదస్సులో బీసీ కులగణను నిర్వహిస్తామని చెప్పానని గుర్తు చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నట్లు కుల గణను నిర్వహించి, బీసీ కులాల లెక్కలు తీస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు బీసీ జాతీయ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ విషయంపై కోర్టులో న్యాయపరమైన అంశాలు ఉన్నందున ప్రత్యేకంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి పంచాయతీ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పినట్లు ఆయన అన్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.