Tirupathi Rao
న్యూ ఇయర్ వేడుకల కోసం రాష్ట్ర ప్రజలు రెడీ అయిపోయారు. ఈ నేపథ్యంలో ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కారు శుభవార్త చెప్పింది.
న్యూ ఇయర్ వేడుకల కోసం రాష్ట్ర ప్రజలు రెడీ అయిపోయారు. ఈ నేపథ్యంలో ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కారు శుభవార్త చెప్పింది.
Tirupathi Rao
తెలంగాణ రాష్ట్రం కొత్త ఏడాది వేడుకలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రజలు న్యూ ఇయర్ పార్టీని ఎలా చేసుకోవాలి? ఆ రోజు స్కెచ్ ఏంటి? ప్లానింగ్ ఏంటనే విషయంలో ఓ క్లారిటీకి వచ్చేశారు. ఈ ఏడాది కొత్త సంవత్సరం వేడుకలను అదరగొట్టేయాలని ప్రిపేర్ అయిపోయారు. మరోవైపు భాగ్యనగరం కూడా కొత్త సంవత్సరం కోసం కొత్తగా ముస్తాబవుతోంది. ఇప్పటికే న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి పోలీసులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆంక్షల నేపథ్యంలో ప్రజలు కాస్త నిరుత్సాహానికి లోనయ్యారు. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఒక శుభవార్తను చెప్పింది.
న్యూ ఇయర్ అనగానే వయసుతో సంబంధం లేకుండా ప్రజలు అందరూ వేడుకలకు సిద్ధమైపోతారు. ఎవరి అలవాట్లు, ఎవరి స్థోమతకు తగ్గట్లు సెలబ్రేషన్స్ ప్లాన్ చేసుకుంటారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఉండే యువత, ఉద్యోగులు అయితే హోటల్స్, పబ్బులు, క్లబ్బులు అంటూ డిసెంబర్ 31 నైట్ మొత్తం ఫుల్ హంగామా చేస్తారు. ఈ ఏడాది మాత్రం సెలబ్రేషన్స్ కు ఎక్కువ ఆస్కారం లేదనే చెప్పాలి. ఎందుకంటే డిసెంబర్ 31 రాత్రి ఒంటి గంటలోపే వేడుకలు పూర్తైపోవాలి. అందుకు కట్టుదిట్టమైన చర్యలు కూడా చేపట్టారు. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఒక శుభవార్త చెప్పింది. అదేంటంటే.. జనవరి 1వ తేదీని జనరల్ హాలీడేగా ప్రకటించింది. అంటే డిసెంబర్ 31 ఆదివారం వచ్చింది. పార్టీ చేసుకుని తెల్లారితే జనవరి 1కి తిరిగి ఆఫీసుకు వెళ్లాలి అని బాధపడుతున్న వారందరికీ ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. న్యూ ఇయర్ పార్టీ చేసుకుని అందరూ అలిసి పోయుంటారు. తర్వాతి రోజు ఉదయాన్నే లేచి విధులకు హాజరు కావాలంటే కష్టంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ హాలిడేకి బదులుగా.. ఫ్రిబవరి నెలలో రెండో శనివారం సెలవును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి నెలలో సెలవు రద్దైనా కూడా.. అవసరం అయినప్పుడు సెలవు లభిస్తోంది అంటూ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంక పార్టీల విషయంలో నగరవాసులు, రాష్ట్ర ప్రజలు హద్దు దాటకుండా ఉండటమే మంచిది. ఇప్పటికే పోలీసు శాఖ స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. హైదరాబాద్ లో ఏ పార్టీ అయినా, ఈవెంట్ అయినా తప్పకుండా పోలీసుల అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. రాత్రి ఒంటి గంట వరకు మాత్రమే పార్టీలు చేసుకునేందుకు అనుమతి ఉంది. తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.10 వేలు జరిమానా, 6 నెలల వరకు జైలు శిక్ష కూడా పడుతుంది. అంతేకాకుండా పబ్బులు, ఈవెంట్ ఆర్గనైజర్స్ కి కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు. తక్కువ సౌండ్ పెట్టడం, పార్కింగ్ విషయంలో ఇబ్బందులు లేకుండా చూడటం, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం, సెక్యూరిటీని పెట్టడం చేయాలని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా కూడా శిక్ష తప్పదని స్పష్టం చేశారు. మరి.. న్యూ ఇయర్ వేడుకల వేళ తెలంగాణ ప్రభుత్వం జనరల్ హాలీడే ప్రకటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.