CM రేవంత్ రెడ్డికి 5వ తరగతి విద్యార్థిని లేఖ! ఏం రాసిందంటే..

తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో తనదైన మార్క్ ను చూపిస్తున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పరిష్కార దిశగా సాగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఓ చిన్నారి లేఖ రాసింది.

తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో తనదైన మార్క్ ను చూపిస్తున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పరిష్కార దిశగా సాగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఓ చిన్నారి లేఖ రాసింది.

సమాజంలో ఉన్న సమస్యలపై చాలా మంది ప్రభుత్వాలకు, అధికారులకు లేఖలు రాస్తుంటారు. అంతేకాక వాటిని పరిష్కరించాలంటూ అనేక మార్లు విజ్ఞప్తులు చేస్తుంటారు. అలానే  మరికొందరు అయితే ఏకంగా ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులకు, ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తుంటారు. ఇదిలా చాలా మంది సమాజంపై ఉన్న అభిమానంతో, అభివృద్ధి కోసం ఇలా స్పందిస్తూ ఉంటారు. ఇక్కడ మరో ప్రత్యేకం ఏమిటంటే.. లోకం అంటే పూర్తిగా ఆగాహన లేని కొందరు చిన్నారులు సైతం తమవంతుగా సమస్యలపై స్పందిస్తుంటారు. అలానే అధికారులకు, ప్రజాప్రతినిధులకు లేఖలు రాసి.. అందరిని ఆకట్టుకుంటారు. అలానే తాజాగా సీఎం రేవంత్ కి 5వ తరగతి చదువుతున్న చిన్నారి లేఖ రాసింది.

కొద్ది రోజుల క్రితమే తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడింది. పదేళ్ల తరువాత ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఇక నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు. ఆయన సీఎంగా బాధ్యతలు తీసుకున్న తరువాత అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికారం అంటే అహంకారం కాదని..ప్రజలకు సేవ చేసే బాధ్యత అని ప్రజలకు తెలిసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజాభవన్ లో ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి.. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. అలానే ప్రజలు సైతం తమ సమస్యలను సీఎంకు చెప్పుకునేందుకు ప్రజాభవన్ కి క్యూ కడుతున్నారు. ఈ కార్యక్రమంపై ప్రజల్లో అనుహ్య స్పందన వచ్చింది.

ఇదే సమయంలో రాష్ట్రంలోని పలు సమస్యలపై సీఎం ఆఫీస్ కి లేఖలు కూడా వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఓ చిన్నారి సైతం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసింది.  ప్రభుత్వ పాఠశాలకు ఉచిత విద్యుత్ ఇవ్వండి అంటూ  5వ తరగతి విద్యార్థిని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసింది. రంగారెడ్డి ఆదిభట్లలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అంజలి అనే చిన్నారి 5వ తరగతి చదువుతుంది. తాను చదువుతున్న పాఠశాలలో ఉన్న సమస్యల గురించి సీఎం రేవంత్ రెడ్డికి తెలియజేయాలని ఆ చిన్నారి మనస్సుకు అనిపించింది. దీంతో వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓ లేఖ రాసింది.

“గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నమష్కరించి వ్రాయునది.. సీఎంగా మీరు ఎన్నికైనందుకు శుభాకాంక్షలు. దయచేసి మా ప్రభుత్వ స్కూలుకు  ఉచిత విద్యుత్ అందించాలని మనవి” అని లేఖ రాసి పోస్ట్ చేసింది. మరి.. చిన్నారి లేఖకు సీఎం స్పందిస్తారో లేదో చూడాలి. గతంలో ఇలా ప్రధాన మంత్రికి లేఖలు రాసిన ఘటనలు అనేకం ఉన్నాయి. వాటిపై ప్రధాని మోదీ సైతం స్పందించారు. సభల్లో సైతం తమదైన వాక్ చాతుర్యంతో ప్రజాప్రతినిధులను ఎంతో మంది చిన్నారులు ఆకట్టుకున్నారు. అప్పట్లో మంత్రిగా ఉన్న హరీష్ రావు వద్ద ఓ చిన్నారి గిరిజన వేషంలో వేసి జాతకం చెప్పింది. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా 5వ తరగతి చదువుతున్న ఈ చిన్నారి కూడా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసి.. అందరిని ఆకట్టుకుంది. మరి.. ఈ  చిన్నారి చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments