చీకోటి ప్రవీణ్.. తెలంగాణలో సంచలనం సృష్టిన పేరు. క్యాసినో కింగ్ గా చీకోటి ప్రవీణ్ ను పిలుస్తూ ఉంటారు. ఇక విదేశాల్లో అక్రమ క్యాసినోలు రన్ చేస్తూన్న వ్యవహారంలో ఫెమా నిబంధనల ఉల్లంఘన, హవాలా చెల్లింపులపై ఇప్పటికే ఈడీ విచారణ ఎదుర్కొంటున్నాడు. అదీకాక నిబంధనలకు విరుద్దంగా రకరకాల జంతువులను పెంచుకుంటూ.. తన ఇంటినే ఓ మినీ జూ పార్క్ చేశాడనే అభియోగాలు సైతం ప్రవీణ్ ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా చీకోటి ప్రవీణ్ రాజకీయాల్లోకి వస్తాడంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలకు మరింత బలం చేకూర్చేలా ప్రవీణ్ ఢిల్లీ వెళ్లి మరీ బీజేపీ నేతలైన బండి సంజయ్, డీకే అరుణను కలిశారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను చీకోటి ప్రవీణ్ ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా శాలువాతో సత్కరించాడు ప్రవీణ్. వీరితో పాటుగా తాజాగా బీజేపీలో చేరిన జయసుధను సైతం చీకోటి ప్రవీణ్ కలిశాడు. కాగా.. గత కొంతకాలంగా చీకోటి ప్రవీణ్ రాజకీయాల్లోకి వస్తాడంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీలో చేరడానికి లైన్ క్లియర్ చేసుకునే క్రమంలోనే రాష్ట్ర బీజేపీ నాయకులను చీకోటి ప్రవీణ్ కలుస్తున్నట్లుగా సంకేతాలు అందుతున్నాయి.
అయితే ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే? తెలంగాణ బీజేపీ నాయకులను తెలంగాణలో కలవకుండా.. ఢిల్లీలో కలవడం వెనక మతలబు ఏంటో అర్ధం కావడం లేదు. ఏది ఏమైనప్పటికీ చీకోటి ప్రవీణ్ మరోసారి రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారారు. బీజేపీ నాయకులను కలవడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయనే చెప్పుకోవాలి. ఆర్థికంగా బలంగా ఉన్న చీకోటి ప్రవీణ్ లాంటి వ్యక్తి బీజేపీలో చేరితే.. ఆ పార్టీ బలం మరింతగా పెరుగుతుందన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మరి బీజేపీ నాయకులను చీకోటి ప్రవీణ్ ఢిల్లీలో కలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదికూడా చదవండి: కోకాపేట భూముల వేలం.. హైదరాబాద్ చరిత్రలో అత్యధిక రేటు