iDreamPost

కోకాపేట భూముల వేలం.. హైదరాబాద్ చరిత్రలో అత్యధిక రేటు

కోకాపేట భూముల వేలం.. హైదరాబాద్ చరిత్రలో అత్యధిక రేటు

ఎకరాకు రూ.100 కోట్లు.. అవును, మీరు చదివింది నిజమే. అది ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోని కోకాపేటలో. నగరంలో ఎన్నడు లేనంతగా రికార్డ్ స్థాయిలో ఎకరాకు రూ.100 కోట్లు పలకడం విశేషం. మరీ ఎకరాకు ఈ స్థాయిలో ధర పలకడం అనేది సాధారణ ప్రజలతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం కోకాపేట్ భూముల ధరలు ఈ స్థాయిలో పలకడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకు అసలు స్టోరీ ఏంటంటే?

హైదరాబాద్ మెట్రోపాలిటిన్ డెవలప్ మెంట్ అథారిటీ (HMDA) కోకాపేటలో నియోపొలిస్ పేరు మీద దాదాపుగా 500 ఎకరాల్లో లేఅవుట్ ను సిద్దం చేసింది. రూ.450 కోట్లు వెచ్చింది ఆ లేఅవుట్ లో రోడ్లు, మురుగు నీరు, తాగునీరు ఇలా ఎన్నో రకాల సదుపాయాలు అన్నీ సిద్దం చేసి ఉంచింది. అయితే గతంలో ఇదే లేఅవుట్ లో మొదటి విడత భూముల వేలం పాట జరిగింది. ఫస్ట్ ఫేజ్ వేలం పాటలో ఏకంగా ఎకరాకు రూ. 60 కోట్ల వరకు పలికింది. ఇదిలా ఉంటే.. HMDA గురువారం కోకాపేట్ నియోపొలిస్ ఫేజ్-2 వేలం పాటను ప్రారంభించింది. ఈ ఆన్ లైన్ వేలం పాటలో ప్లాట్లు దక్కించుకోవడానికి ప్రజలతో పాటు కొన్ని దిగ్గజ స్థిరాస్తి సంస్థలు పోటీ పడ్డాయి. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన ఈ వేలం పాట సాయంత్రం 6 గంటల వరకు హోరాహోరీగా కొనసాగింది.

అయితే ముందుగా HMDA నియోపొలిస్ లో వేలంలో ఎకరా భూమి ధర రూ.35 కోట్లుగా నిర్ణయించింది. ఇక మార్నింగ్ సేషనల్ లో 6,7,8,9 వంటి ప్లాట్ వేలం పాటలో ఎకరా రూ.75 కోట్లు పలికింది. ఇక సాయంత్రం 10,11,14 ప్లాట్లకు జరిగిన వేలం పాటలో ప్లాట్ నెంబర్ 10లో ఎకరాకు ఏకంగా రూ.100 కోట్లు పలికింది. ఈ ప్లాట్ లో 3.60 ఎకరాలు ఉండడం విశేషం. కాగా, ఈ రోజు జరిగిన 6,7,8,9 ప్లాట్ల వేలం పాటలో ప్రభుత్వానికి రూ.1,532.50 కోట్లు సమకూరగా, 10 నెంబర్ ప్లాట్ కు మాత్రం ఏకంగా రూ.360 కోట్లకు పైగా ఆదాయం సమకూరడం విశేషం. మరో విషయం ఏంటంటే? ఈ రోజు జరిగిన కోకాపేట్ నియోపొలిస్ ఫేజ్-2 వేలం పాటలో మైహోం, షాపూర్‌జీ పల్లోంజీ, ఎన్‌సీసీ, రాజపుష్ప లాంటి దిగ్గజ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు పాల్గొన్నాయి.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌ శివారులో ఆసియాలోనే అతి పెద్ద మార్కెట్‌.. ఏకంగా 199 ఎకరాల్లో

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి