Dharani
Bangalore-Hyderabad: బెంగళూరు, హైదరాబాద్ నగరాల మధ్య ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. ఆ రూట్లో ట్రాఫిక్ రద్దీ కంట్రోల్‌కు చర్యలు తీసుకోనుంది. ఆ వివరాలు..
Bangalore-Hyderabad: బెంగళూరు, హైదరాబాద్ నగరాల మధ్య ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. ఆ రూట్లో ట్రాఫిక్ రద్దీ కంట్రోల్‌కు చర్యలు తీసుకోనుంది. ఆ వివరాలు..
Dharani
నిత్యం రద్దీగా ఉండి.. ఎక్కువ మంది ప్రయాణించే మార్గం ఏది అంటే హైదరాబాద్ టూ బెంగళూరు అని చెప్పవచ్చు. ఈ రూట్లో నిత్యం విపరీతమైన రద్దీ ఉంటుంది. రెండు మెట్రో నగరాలు కావడం, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయిస్ మాత్రమే కాక ఉపాధి నిమిత్తం జనాలు ఎక్కువగా వెళ్లేది కూడా ఈ నగరాలకే కావడంతో ఫుల్లు బిజీగా ఉంటుంది. అందుకే ఈ రూట్లో వెళ్లే బస్సులు, రైళ్లు, ఆఖరికి రోడ్లు కూడా నిత్యం కిక్కిరిసి ఉంటాయి. రద్దీ నేపథ్యంలో ఈ మార్గాల్లో ప్రయాణాలు సులభతరం చేయడానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. సమస్యకు పూర్తి స్థాయిలో పరిష్కారం లభించడం లేదు. ఈ క్రమంలో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం చేసే వారికి కేంద్రం శుభవార్త చెప్పింది. ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దిశగా కొత్త ప్లాన్‌ను సిద్ధం చేస్తుంది. ఆ వివరాలు..
హైదరాబాద్, బెంగళూరు.. దక్షిణాదిలో నిత్యం రద్దీగా ఉండే మార్గాలు అనగానే అందరికి ముందుగా ఇవే గుర్తుకు వస్తాయి. నిత్యం వేల మంది ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం చేస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు మహా నగరాల మధ్య ట్రాఫిక్ రద్దీ, భవిష్యత్ అవసరాల దృష్ట్యా.. ఈ మార్గాల్లో రోడ్డు విస్తరణకు కేంద్రం సిద్ధమైంది. దానిలో భాగంగా హైదరాబాద్-బెంగళూరు మధ్య ఉన్న 44వ జాతీయ రహదారిని విస్తరించాలని నిర్ణయించుకుంది.
ప్రస్తుతం ఈ రహదారి 4 వరుసలుగా ఉండగా.. దాన్ని 12 వరుసలకు విస్తరించేందుకు సిద్ధమైంది. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి మెుత్తం పొడవు 576 కి.మీ కాగా.. తెలంగాణలో ఈ రహదారి విస్తీర్ణం 210 కి.మీ ఉంటుంది. ఏపీలో 260 కి.మీ, కర్ణాటకలో 106 కి.మీ పొడవు ఉంటుంది. ఇదంతా ఇప్పుడు 4 వరుసలుగా ఉండగా.. దాన్ని 12 వరుసలకు విస్తరించేందుకు కేంద్రం సిద్ధమైంది.ఇక హైదరాబాద్-బెంగళూరు మధ్య ఉన్న 44వ జాతీయ రహదారిని 12 వరుసలకు విస్తరిస్తే.. గణనీయమైన అభివృద్ది జరగనుంది. తెలంగాణతో పాటు ఏపీలోని ఈ రహదారి వెళ్లే ప్రాంతంలో భూముల ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు.
ఇక కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా ఉన్న ఎక్స్‌ప్రెస్‌ల వెంట ఎకానమిక్ జోన్లు (ఆర్థిక నడవాలు) ఏర్పాటు చేసి వాటికి ప్రోత్సాహకాలు కూడా అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ-కర్ణాటక రాష్ట్రాలను పారిశ్రామికంగా మరింతగా అభివృద్ధి చేయటంలో ఈ రహదారి విస్తరణ మరింత కీలకం కానుంది అంటున్నారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య ఈ రహదారిని 12 వరసలుగా విస్తరించటం ద్వారా.. ఏపీలోని రాయలసీమ ప్రాంతం కూడా పారిశ్రామికంగా అభివృద్ది చెందుతుంది అని భావిస్తున్నారు.