గుడ్ న్యూస్.. మే 27న వాళ్లందరికీ సెలవు! ఎందుకంటే?

గుడ్ న్యూస్.. మే 27న వాళ్లందరికీ సెలవు! ఎందుకంటే?

తెలంగాణలో వారందరికీ ఆ రోజు సెలవు లభించనుంది. ఆ జిల్లాల్లోని వారికి సెలవు ప్రకటిస్తూ ఎన్నికల సంఘం తీపి కబురును అందించింది. ఇంతకీ ఏయే జిల్లాల్లో అంటే?

తెలంగాణలో వారందరికీ ఆ రోజు సెలవు లభించనుంది. ఆ జిల్లాల్లోని వారికి సెలవు ప్రకటిస్తూ ఎన్నికల సంఘం తీపి కబురును అందించింది. ఇంతకీ ఏయే జిల్లాల్లో అంటే?

దేశంలో సార్వత్రిక ఎన్నికల సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. మొత్తం ఏడు దశల్లో పూర్తి కానున్నాయి లోక్ సభ ఎలక్షన్స్. ఇప్పటికే ఇరు తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. వీటికి సంబంధించిన ఫలితాలు వచ్చే నెల జూన్ 04న వెలువడనున్నాయి. కాగా ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్లను పోలింగ్ లో పాల్గొనేలా వారికి ఆయా పోలింగ్ తేదీల్లో సెలవును కూడా ప్రకటిస్తున్నది. ప్రైవేట్ కంపెనీలకు చెందిన ఉద్యోగులకు సైతం వేతనంతో కూడిన సెలవును ఇవ్వాలని కంపెనీలకు ఆదేశాలు జారీ చేస్తున్నది ఎన్నికల సంఘం. ఈ క్రమంలో తెలంగాణలోని ఆజిల్లాల వారికి ఆ రోజున సెలవు లభించనుంది. వారందరికీ సెలవును ప్రకటించింది ఎన్నికల సంఘం.

తెలంగాణలో మరో ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. మే 27న ఉమ్మడి ఖమ్మం- వరంగల్- నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ 3 ఉమ్మడి జిల్లాల పరిధిలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఎన్నికల సంఘం సెలవు ప్రకటించింది. పట్టభద్రులైన ఉద్యోగులందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ప్రకటించింది. మే 27న నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పట్టభద్రులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సెలవు లభించనుంది.

అయితే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ప్రైవేట్ ఉద్యోగులకు సైతం సెలవును ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఎంఎల్సీ ఉప ఎన్నికకు మాత్రం ప్రైవేట్ ఉద్యోగులకు సెలవు ఇచ్చేందుకు ఈసీ నుంచి ఎలాంటి నిబందనలు లేవని సీఈఓ ఆఫీస్ తెలిపింది. అయితే పట్టాభద్రులైన ఉద్యోగులను కలిగిన కంపెనీలు వారిని పోలింగ్ లో పాల్గొనేలా వెసులుబాటు కల్పించాలని ప్రైవేట్ కంపెనీలకు సూచించింది. ఇక ఈ ఎంఎల్సీ స్థానాన్ని గెలుచుకోవాలని రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా ప్రచారాలు చేస్తున్నాయి. ఉమ్మడి వరంగల్- ఖమ్మం- నల్గొండ జిల్లాల్లో 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నట్టు సమాచారం.

Show comments