CAT Hearing: IASలకు CATలో చుక్కెదురు.. APకి వెళ్లాల్సిందే అంటూ..!

CAT Hearing On IAS Officers Petition Updates: ఐఏఎస్ అధికారులకు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ లో చుక్కెదురైంది. వారి బదిలీ ఉత్తర్వులను నిలిపివేయాలంటూ అధికారులు క్యాట్ ని ఆశ్రయించారు. అయితే క్యాట్ మాత్రం అధికారులు బదిలీకి వెళ్లాల్సిందే అంటూ స్పష్టం చేసింది.

CAT Hearing On IAS Officers Petition Updates: ఐఏఎస్ అధికారులకు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ లో చుక్కెదురైంది. వారి బదిలీ ఉత్తర్వులను నిలిపివేయాలంటూ అధికారులు క్యాట్ ని ఆశ్రయించారు. అయితే క్యాట్ మాత్రం అధికారులు బదిలీకి వెళ్లాల్సిందే అంటూ స్పష్టం చేసింది.

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐఏఎస్ అధికారుల బదిలీ విషయంలో కాస్త సందిగ్దత నెలకొన్న విషయం తెలిసందే. కేంద్రం ఈ నెల 9న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ ఉత్తర్వులను రద్దు చేయాలి అంటూ ఐఏఎస్ అధికారులు క్యాట్(సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యూనల్)ను ఆశ్రయించారు. ఈ క్యాట్ లో ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, ఆమ్రపాలి, వాణీప్రసాద్, రొనాల్డ్ రాస్, సృజనలకు ఊరట లభించలేదు. అంతేకాకుండా.. అధికారుల పిటిషన్ విచారణ సందర్భంగా క్యాట్ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. తిరిగి ఐఏఎస్ అధికారులనే క్యాట్ ప్రశ్నించింది. బదిలీపై ఆంధ్రప్రదేశ్ వెళ్లాల్సిందే అంటూ స్పష్టమైన ఉత్తర్వులను జారీ చేసింది.

కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ప్రస్తుతం తెలంగాణలో విధులు నిర్వర్తిస్తున్న వాకాటి కరుణ, ఆమ్రపాలి, రొనాల్డ్ రాస్, వాణీప్రసాద్ లు ఏపీకి వెళ్లాలి. అక్కడున్న సృజన తెలంగాణకు రావాల్సి ఉంది. అయితే తమని తెలంగాణలోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఈ ఐఏఎస్ అధికారులు కోరుతున్నారు. అందుకు సంబంధించే క్యాట్లో ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. అంతేకాకుండా.. కేటాయింపుల విషయంలో తమ అభ్యర్థనలను పరిగణలోకి తీసుకేలుద అంటూ వ్యాఖ్యానించారు. ఐఏఎస్ అధికారులు తాము ప్రస్తుతం ఉన్న రాష్ట్రంలోనే ఉంచేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలి అని కోరుతున్నారు.

ఐఏఎస్ అధికారుల పిటిషన్ విచారణ సందర్భంగా క్యాట్ కీలక వ్యాఖ్యలు చేసింది. “ఐఏఎస్ అధికారుల కేటాయింపుల విషయంలో DOPTకి పూర్తి అధికారులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ప్రాంతాలకు వెళ్లి మీరు సేవ చేయాలి అంటే.. చేయరా? మీకు స్థానికత ఉన్నా.. స్వాప్ చేసుకునే అధికారం గైడ్ లైన్స్ లో ఉందా?” అంటూ క్యాట్ ప్రశ్నించింది. మరోవైపు ఐఏఎస్ అధికారుల తరఫు న్యాయవాది కొన్ని అభ్యంతరాలను క్యాట్ దృష్టికి తీసుకెళ్లారు. సింగిల్ మెన్ కమిటీ సిఫార్సులను డీవోపీటీ పట్టించుకోవడం లేదు అంటూ న్యాయవాది తెలిపారు. ఈ విచారణ సందర్భంగా ఐఏఎస్ అధికారులకు క్యాట్ నుంచి ఊరట లభించలేదు. అధికారులు కోరుకున్న విధంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ నిరాకరించింది. వాకాటి కరుణ, ఆమ్రపాలి, రొనాల్డ్ రాస్, వాణీప్రసాద్ ఆంధ్ర ప్రదేశ్ కు వెళ్లాల్సిందే అంటూ స్పష్టం చేసింది. క్యాట్ అందుకు సంబంధించి స్పష్టమైన ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

Show comments