SR నగర్ అపార్ట్మెంట్‌లో బర్త్ డే పార్టీ.. డ్రగ్స్‌తో పట్టుబడిన IT ఉద్యోగులు!

హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్ లో డ్రగ్స్ కలకలం సృష్టించింది. బర్త్ డే పార్టీలో డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడ్డారు. పట్టుబడిన వారిలో ఐటీ ఉద్యోగులు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉండడంతో హాట్ టాపిక్ గా మారింది.

హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్ లో డ్రగ్స్ కలకలం సృష్టించింది. బర్త్ డే పార్టీలో డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడ్డారు. పట్టుబడిన వారిలో ఐటీ ఉద్యోగులు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉండడంతో హాట్ టాపిక్ గా మారింది.

దేశాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి డ్రగ్స్. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వాలు కఠిన చట్టాలను తీసుకొస్తున్నప్పటికీ వాటి వాడకం మాత్రం తగ్గడం లేదు. కొంత మంది గుట్టుగా డ్రగ్స్ ను రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. డ్రగ్స్ మత్తులో పడి యువత వారి జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. డ్రగ్స్ మత్తులో అనేక నేరాలకు పాల్పడుతున్నారు. డ్రగ్స్ తో పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ డ్రగ్స్ వినియోగం మాత్రం తగ్గడం లేదు. తాజాగా హైదరాబాద్ నగరంలోని ఎస్సార్ నగర్ లో బీటెక్ విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు డ్రగ్స్ తో పోలీసులకు పట్టుబడ్డారు.

డ్రగ్స్ మత్తులో యువత చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు. ఎస్సార్ నగర్ లో ఓ అపార్ట్ మెంట్ లో జరిగిన బర్త్ డే పార్టీలో డ్రగ్స్ కలకలం సృష్టించింది. ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడ్డారు ఐటీ ఉద్యోగులు, 12 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు. భారీగా డ్రగ్స్ పట్టుబడడంతో స్థానికంగా తీవ్ర అలజడి రేగింది. ఎస్సార్ నగర్ లోని సర్వీస్ అపార్ట్మెంట్లో పార్టీ చేసుకుంటుండగా నార్కోటిక్ బ్యూరో పోలీసులు డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఫ్రెండ్ బర్త్ డే పార్టీ కోసం గోవా నుంచి ఎక్స్టెన్స్ పిల్స్ ను యువకులు తీసుకువచ్చారని పోలీసులు వెల్లడించారు.

డ్రగ్స్ తీసుకుంటూ పట్టబడిన వారిలో సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ ఉండడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రేమ్ చంద్ అనే వ్యక్తి బర్త్ డే కోసం గోవా నుంచి సంపత్ అనే స్నేహితుడు డ్రగ్స్ తెప్పించాడని పోలీసులు తెలిపారు. 30 మంది కోసం డ్రగ్ పార్టీని ప్రేమ్ చంద్ ఏర్పాటు చేశాడని పోలీసులు వెల్లడించారు. పోలీసులకు పట్టుబడిన వారంతా ఐటీ రంగానికి చెందిన వారే కావడంతో నగరంలో హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ సాప్ట్ వేర్ కంపెనీలో వీళ్లంతా కలసి పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. అయితే పట్టుబడిన వారంతా ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాకు చెందిన వారేనని పోలీసులు చెప్పారు. హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ పట్టుబడడంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. బర్త్ డే పార్టీలో డ్రగ్స్ వాడుతూ పట్టుబడిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments