iDreamPost
android-app
ios-app

KTR: ఎన్నికల్లో ఓటమికి నేనే బాధ్యుడిని: KTR.. బీజేపీతో పొత్తుపై క్లారిటీ!

  • Published Jan 12, 2024 | 8:14 PM Updated Updated Jan 12, 2024 | 8:14 PM

తెలంగాణలో త్వరలోనే జరగబోయే లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఈ క్రమంలోనే జిల్లాల వారిగా కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు చేపడుతోంది. అందులో భాగంగా జరిగిన ఓ మీటింగ్ లో కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు.

తెలంగాణలో త్వరలోనే జరగబోయే లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఈ క్రమంలోనే జిల్లాల వారిగా కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు చేపడుతోంది. అందులో భాగంగా జరిగిన ఓ మీటింగ్ లో కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు.

KTR: ఎన్నికల్లో ఓటమికి నేనే బాధ్యుడిని: KTR.. బీజేపీతో పొత్తుపై క్లారిటీ!

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఓటమిపై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెట్ కేటీఆర్. రాష్ట్రంలో రాబోయే లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీ జిల్లాల వారిగా కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు చేపడుతోంది. అందులో భాగంగా ఈరోజు(శుక్రవారం) తెలంగాణ భవన్ లో భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్ లో కేటీఆర్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడానికి బాధ్యుడిని నేనే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ తప్పుల కారణంగా పార్టీ ఓడిపోయిందని చెప్పుకొచ్చారు.

తెలంగాణలో త్వరలోనే జరగబోయే లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి ఈ ఎన్నికల్లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే జిల్లాల వారిగా కార్యకర్తలో సమావేశాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా తాజాగా భువనగిరి జిల్లా పార్లమెంట్ స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడానికి బాధ్యుడిని నేనే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్య కార్యకర్తలను పట్టించుకోలేకపోయానని, అందరినీ సమన్వయం చేయడంలో విఫలం అయ్యానని ఆయన పేర్కొన్నారు.

ఇక దళితబంధు పథకం కొందరికే ఇవ్వడంతో.. మిగిలిన వారు అసంతృప్తికి లోనైయ్యారని ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇక భూస్వాములకూ రైతుబంధు ఇవ్వడాన్ని సామాన్య ప్రజలు, రైతులు అంగీకరించలేదని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కేటీఆర్ సూచించారు. ఈ సందర్భంగా బీజేపీతో పొత్తుపై క్లారిటీ ఇచ్చారు. బీజేపీతో గతంలోనూ పొత్తు లేదని, భవిష్యత్ లోనూ ఉండదని కేటీఆర్ స్ఫష్టం చేశారు. మరి ఓటమికి నేనే బాధ్యుడిని అన్న కేటీఆర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి