iDreamPost
android-app
ios-app

MLC Kavitha: కవిత అరెస్టు​లో హైలైట్​గా వారెంట్.. అసలు ట్రాన్సిట్ వారెంట్ అంటే ఏంటి?

  • Published Mar 15, 2024 | 8:16 PM Updated Updated Mar 15, 2024 | 8:16 PM

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఈ అరెస్టులో ట్రాన్సిట్ వారెంట్ హైలైట్​గా నిలిచింది. ఈ నేపథ్యంలో అసలు ట్రాన్సిట్ వారెంట్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఈ అరెస్టులో ట్రాన్సిట్ వారెంట్ హైలైట్​గా నిలిచింది. ఈ నేపథ్యంలో అసలు ట్రాన్సిట్ వారెంట్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Mar 15, 2024 | 8:16 PMUpdated Mar 15, 2024 | 8:16 PM
MLC Kavitha: కవిత అరెస్టు​లో హైలైట్​గా వారెంట్.. అసలు ట్రాన్సిట్ వారెంట్ అంటే ఏంటి?

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేశారు. అరెస్టు విషయాన్ని కవిత ఫ్యామిలీకి తెలియజేసిన ఈడీ ఆఫీసర్స్.. ఆమెను ఢిల్లీకి తరలించేందుకు రెడీ అయ్యారు. శుక్రవారం రాత్రి 8 గంటల 45 నిమిషాలకు కవితను ఢిల్లీకి తరలించనున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతను కారులో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్టుకు ఈడీ అధికారులు తరలిస్తున్నారు. ఇప్పటికే కవితను తీసుకెళ్లే మార్గాన్ని పోలీసులు క్లియర్ చేశారు. ఈడీ అధికారులు ఇలా హఠాత్తుగా వచ్చి షాక్ ఇవ్వడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలో కవితను అరెస్టు చేసిన వారెంట్ హైలైట్​గా మారింది. ఆమెను ట్రాన్సిట్ వారెంట్ లేకుండానే అదుపులోకి తీసుకున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో అసలు ట్రాన్సిట్ వారెంట్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఏదైనా కేసులో నిందితుడి మీద ఒక రాష్ట్రంలో ఎఫ్​ఐఆర్ రిజిస్టర్ నమోదు చేశారని అనుకుందాం.. అయితే అక్యూస్డ్ మాత్రం వేరే రాష్ట్రంలో ఉన్నాడు. అప్పుడు అతడ్ని అరెస్ట్ చేసి కేసు నమోదైన స్టేట్​కు తీసుకురావాలి అంటే స్థానిక కోర్టు ఆర్డర్ కావాలి. దాన్నే ట్రాన్సిట్ రిమాండ్ ఆర్డర్ అని అంటారు. ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టు అయ్యారు. ఆమె మీద ఢిల్లీలో కేసు రిజిస్టర్ అయింది. అయితే ఆమెను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నది తెలంగాణలో. అలాంటప్పుడు కవితను ఢిల్లీకి తరలించాలంటే ఇక్కడి లోకల్ కోర్డులో ప్రొడ్యూస్ చేయాలి. కోర్టు ట్రాన్సిట్ ఆర్డర్ ఇస్తే అప్పుడు కవితను ఢిల్లీకి తీసుకెళ్లొచ్చు. కానీ ఈడీ ఆఫీసర్స్ ఇది లేకుండానే బీఆర్ఎస్ నేతను తరలించేందుకు సిద్ధమయ్యారు. అందుకే ఆమె అరెస్టు సమయంలో కేటీఆర్ గొడవకు దిగారు.

ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా అరెస్టు చేస్తారని ఈడీ ఆఫీసర్స్​ను ప్రశ్నించారు కేటీఆర్. ‘అరెస్ట్ చేయబోమంటూ సుప్రీం కోర్టుకు మాట ఇచ్చారు. కానీ ఇప్పుడు ఎలా అదుపులోకి తీసుకున్నారు? శుక్రవారం నాడు కావాలనే వచ్చారు. సుప్రీంకు ఇచ్చిన మాట తప్పుతున్న ఈడీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు’ అని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. సోదాలు పూర్తయిన తర్వాత కూడా ఇంట్లోకి రావొద్దని ఈడీ ఆఫీసర్స్ ఆదేశాలు జారీ చేయడం మీద ఆయన ఫైర్ అయ్యారు. కవిత అక్రమ అరెస్టును లీగల్​గా ఎదుర్కొంటామన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు శాంతియుతంగా వ్యవహరించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​కు సహకరిస్తామని కవిత కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నేతలు తెలిపారు.

ఇదీ చదవండి: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇకపై రేషన్ కార్డ్స్ లేకున్నా!