iDreamPost

తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇకపై రేషన్ కార్డ్స్ లేకున్నా!

Telangana Government Key Decision: రేవంత్ సర్కార్ రాష్ట్ర ప్రజలకు మరో శుభవార్త అందించేందుకు రెడీ అయిపోయింది. రేషన్ కార్డు లేని వారికి కూడా కొన్ని సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.

Telangana Government Key Decision: రేవంత్ సర్కార్ రాష్ట్ర ప్రజలకు మరో శుభవార్త అందించేందుకు రెడీ అయిపోయింది. రేషన్ కార్డు లేని వారికి కూడా కొన్ని సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.

తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇకపై రేషన్ కార్డ్స్ లేకున్నా!

తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కార్ తమదైనశైలి పాలన, ప్రణాళికలు, పథకాలతో దూసుకుపోతోంది. ప్రజలకు సంక్షేమ పథకాలను అందించేందుకు ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామంటూ సీఎం రేవంత్ పదే పదే చెబుతూనే ఉన్నారు. గ్యారెంటీల్లో భాగంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని మళ్లీ ప్రారంభించడమే కాకుండా.. ఏడాదికి రూ.10 లక్షల వరకు లిమిట్ ని పెంచతూ నిర్ణయం తీసుకున్నారు. అందుకు సంబంధించిన ఉతర్వులు కూడా జారీ చేశారు. ఇప్పుడు ఆరోగ్య శ్రీ పథకం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే కొత్త ఆరోగ్య శ్రీ కార్డులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన రెండు రోడుల్లోనే ఆరోగ్య శ్రీ పథకం గురించి కీలక నిర్ణయం తీసుకుంది. అప్పటి వరకు ఏడాదికి రూ.5లక్షలుగా ఉన్న లబ్ధి పరిధిని ఏకంగా రూ.10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి తగినట్లు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే ఆరోగ్యశ్రీ పథకాన్ని దివంగత నేత, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పుడు ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డులే ఇప్పటికీ అమలులో ఉన్నాయి. అయితే ఈ విషయంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోకున్నట్లు సమాచారం. కొత్త ఆరోగ్య శ్రీ కార్డులను జారీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ప్రక్రియ త్వరలోనే కార్యరూపం దాల్చనున్నట్లు చెప్తున్నారు. రూ.10 లక్షలకు పెంచిన లిమిట్ కి తగినట్లు కొత్త కార్డులను కూడా జారీ చేయనున్నారు. అంతేకాకుండా రేషన్ కార్డులు లేకపోయినా కొత్త ఆరోగ్య శ్రీ కార్డులను పంపిణీ చేయబోతున్నారని చెప్తున్నారు.

రేషన్ కార్డు లేకున్నా ఆరోగ్యశ్రీ:

ఇప్పటివరకు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఏ ప్రభుత్వమైనా అదే పని చేస్తోంది. కానీ, అందుకు భిన్నంగా రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకోబోతోంది. రేషన్ కార్డుల విషయంలో సమస్యలు ఉండటం, వేరు కాపురాలు పెట్టడం, సరైన పత్రాలు లేక రేషన్ కార్డలు పొందలేకపోవడం వంటి సమస్యలు ఎంతో మందికి ఉంటాయి. అలాంటి సమస్యలతో ఆరోగ్య శ్రీ పథకాన్ని పొందలేకపోతున్నవాళ్లు కూడా చాలామందే ఉన్నారు. అలాంటి వారికి కూడా న్యాయం చేసేలా రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకోబోతోందని చెప్తున్నారు. రేషన్ కార్డు లేకపోయినా ఆరోగ్యశ్రీ కార్డులను మంజూరు చేస్తారని చెప్తున్నారు. అయితే అందరికీ అలా ఆరోగ్య శ్రీ కార్డులు ఇచ్చేయరు. ఎవరైతే ఆర్థికంగా, ఆదాయం పరంగా అర్హులవుతారో వారికి కొత్తగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డులను మంజూరు చేస్తారని తెలుస్తోంది. మరి.. రేషన్ కార్డు లేకపోయినా ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తామంటూ చెప్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి