బ్రేకింగ్: మరో నలుగురు MP అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్

BRS Announced four MP Candidatesతెలంగాణలో త్వరలో పార్లమెంట్ ఎన్నికల జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్ధుల జాబితా ప్రకటిస్తున్నారు.

BRS Announced four MP Candidatesతెలంగాణలో త్వరలో పార్లమెంట్ ఎన్నికల జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్ధుల జాబితా ప్రకటిస్తున్నారు.

ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో పరాజయం పొందిన బీఆర్ఎస్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంది. గత ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై సమీక్షలు నిర్వహించి.. రాబోయే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పావులు కదుపుతుంది. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా రిలీజ్ చేస్తుంది ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్. తాజాగా మరో నాలుగు స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. ఈసారి అన్ని విషయాల్లో ఆచీ తూచీ వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ అధినేత మరోసారి భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. వివరాల్లోకి వెళితే..

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ మరో నాలుగు స్థానాలకు గాను అభ్యర్థుల జాబితా రిలీజ్ చేసింది. చేవెళ్ల అభ్యర్థిగా కాసాన జ్ఞానేశ్వర్ ముదిరాజ్, జహీరాబాద్ – అనిల్ కుమార్, వరంగల్ – డాక్టర్ కడియం కావ్య, నిజామాబాద్ – బాజిరెడ్డి గోవర్ధన్ ను ఖారారు చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. అయితే వరంగల్ లోక్ సభ పరిధిలోని నేతలతో ఇప్పటికే సమావేశం అయి అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. అలాగే వరంగల్, చేవెళ్లలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు ఉన్నప్పటికీ.. ఈసారి కొత్త వారికి అవకాశం కల్పించారు. ఈ మేరకు సిట్టింగ్ ఎంపీలతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. చేవెళ్ల ఎంపీ గా కొనసాగుతున్న రంజీత్ రెడ్డి మరోసారి పోటీకి ఆసక్తి చూపించకపోవడంతో అక్కడ కాసాని జ్ఞానేశ్వర్‌ కి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది.

వరంగల్ లో ఎంపీ పసునూరి దయాకర్ ఇప్పటికే రెండు దఫాలుగా ప్రాతినిధ్యం వహించారు.. ఈసారి పోటీ చేయడానికి ఆసక్తి చూపినప్పటికీ ఆయనకు అవకాశం ఇవ్వలేదు. అయితే తాను బీఆర్ఎస్ లో కార్యకర్తగా పనిచేస్తాని చెప్పారు. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో సీనియర్ నేత కడియం శ్రీహరి కూతురు డాక్టర్ కడియం కావ్య పేరును ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. తాజా ప్రకటన తో మొత్తం 9 మంది అభ్యర్థిత్వాలతు ప్రకటించింది.

Show comments