iDreamPost
android-app
ios-app

నడిరోడ్డుపై కాలి బూడిదైన BMW కారు.. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో

  • Published Dec 28, 2023 | 1:11 PM Updated Updated Dec 28, 2023 | 1:11 PM

ఈ మద్య కాలంలో హైదరాబాద్ లో అగ్ని ప్రమాదాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. కొన్నిసారులు ఆగి ఉన్న వాహనాల్లో అగ్ని చెలరేగి కాలి బూడిద అవుతున్నాయి.

ఈ మద్య కాలంలో హైదరాబాద్ లో అగ్ని ప్రమాదాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. కొన్నిసారులు ఆగి ఉన్న వాహనాల్లో అగ్ని చెలరేగి కాలి బూడిద అవుతున్నాయి.

నడిరోడ్డుపై కాలి బూడిదైన BMW కారు.. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో

ఇటీవల హైదరాబాద్ లో పలు చోట్ల అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రజలు భయాందోళకు గురి అవుతున్నారు. సాధారణంగా వేసవి కాలంలో తరుచూ అగ్ని ప్రమాదాలు జరగడం వింటుంటాం.. కానీ గత నెలలో వరుస అగ్ని ప్రమాదాలో షాక్ కి గురి చేశాయి. కొన్నిసార్లు ఎలక్ట్రిక్ వాహనాలు, కార్లల్లో హఠాత్తుగా మంటలు చెలరేగి క్షణాల్లో కాలి బూడిత అవుతుంటాయి. కొన్నిసార్లు ఈ ప్రమాదాలతో ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. తాజాగా హైదరాబాద్ నారాయణ గూడలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. రోడ్డుపై ఉన్న ఓ బీఎండబ్ల్యూ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.. దీంతో పక్కన ఉన్న జనాలు పరుగులు తీశారు. వివరాల్లోకి వెళితే..

హైబారాబాద్ కొత్తగా ఏర్పాటు చేసిన సచివాలయం వద్ద మింట్ కంపౌండ్ లో రోడ్డుపై వెళ్తున్న ఓ బీఎండబ్ల్యూ (టీఎస్ 09 ఎఫ్ ఎం 0094) కారులో నుంచి హఠాత్తుగా మంటలు చెలరేగాయి. బానెట్ లో నుంచి మంటలతో పాటు పొగ రావడంతో అందులో ఉన్న డ్రైవర్ కారును పక్కకు తీసుకువెళ్లి ఆపి బయటకు పరుగులు తీశాడు. తర్వాత కారులో నుంచి ఉవ్వేత్తున అగ్ని కీలలు ఎగసిపడ్డాయి.. చుట్టూ నల్లటి పొగలు వ్యాపించాయి. అది చూసిన జనాలు అక్కడ నుంచి పరుగులు తీశారు. కొంతమంది స్థానికులు కారు వద్దకు వెళ్లి కారుపై ఇసుక వేస్తూ మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.. కానీ సాధ్యపడలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు.

అదే సమయంలో అక్కడికి చెట్లకు నీరు పోసేందుకు జీహెచ్ఎంసీ వాహనం రావడంతో.. వాటర్ ట్యాంకర్ ను వాహనం వద్దకు తీసుకువచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బీఎండబ్ల్యూ కారు సోమాజీగూడ ఆర్డీఏ కార్యాలం ఎదురుగా ఉన్న కున్ మోటర్స్ పేరిట ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సదరు షోరూం ప్రతినిధి బాలకృష్ణ స్టేషన్ కి వచ్చి ప్రమాద సమయంలో కారు నడుపుతుంది గోవింద్ రెడ్డి అని పోలీసులకు తెలిపారు. కారులో షార్ట్ సర్క్యూట్ వల్ల ఇలా జరిగి ఉంటుందని భావిస్తున్నారు.