Swetha
Free Bus Scheme: తెలంగాణాలో మహిళలకు ఫ్రీ బస్సు పథకం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈ విషయమై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
Free Bus Scheme: తెలంగాణాలో మహిళలకు ఫ్రీ బస్సు పథకం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈ విషయమై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
Swetha
ఇప్పటికే తెలంగాణాలో మహాలక్మి పథకంలో భాగంగా అమలులో ఉన్న.. మహిళలకు ఉచిత ప్రయాణం గురించి అందరికి తెలిసిన విషయమే. ఈ విషయంలో ఇప్పటివరకు అనేక కథనాలు నిత్యం వార్తల్లో వింటూనే ఉన్నాము. అయితే తాజాగా , ఈ ఫ్రీ బస్సు జర్నీ గురించి.. బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. టికెట్ కొనొగోలు చేసే స్థోమత ఉన్న ప్రజలు కూడా ఈ ఫ్రీ సర్వీస్ ను ఉపయోగించుకుంటున్నారు. అలాంటి వారు తన దృష్టిలో బిచ్చమెత్తుకున్నట్లేనని వెంకటరమణా అన్నారు. దీనితో ఆయన మహిళలపై చేసిన ఈ కామెంట్స్ సామజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలను పలువురు నెటిజన్లు ఖండిస్తూ .. విమర్శిస్తున్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన తరువాత.. నగరాల్లో ఆర్టీసీ బస్సుల్లో విపరీతంగా రద్దీ పెరిగిపోయింది. ఒకప్పుడు ఈ ఆర్టీసీ బస్సుల్లో సుమారు 12 లక్షల మంది ప్రయాణించగా.. ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా దాదాపు 30 లక్షలకు చేరింది. ఈ విషయమై ఒక్కొక్కరు ఒక్కోలా వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. కొందరికి ఈ సర్వీస్ ఇబ్బంది కరంగా ఉంటుంది. అలాగే మరికొందరికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ క్రమంలో కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా స్పదింస్తున్నారు.
వెంకటరమణా రెడ్డి ఉచిత బస్సు పథకమై స్పందిస్తూ ఈ విధంగా పేర్కొన్నారు. “ఫ్రీ ఎవరికి ఉండాలో వాళ్లకు ఉండాలి. నీ దగ్గర పేయింగ్ కేపబిలిటీ ఉండి నెలకు రూ. 10 వేల సంపాదిస్తూ కూడా ఫ్రీ బస్సు జర్నీ వాడితే.. నా దృష్టిలో నువ్వు బిచ్చమెత్తుకున్నట్లే. భగవంతుడు చిన్న చూపు చూసి గుడి దగ్గర ఉండి అమ్మా.. అయ్యా అంటూ అడుక్కుంటారు చూశారా.. వాళ్లలాగే మీరు కూడా. నీకు రూ.10 వేల జీతం ఉండి రూ.10 టికెట్ తీసుకోకుండా ఫ్రీ బస్సు ఎంజాయ్ చేస్తున్నావంటే బిచ్చమెత్తుకున్నట్లే. ఆ రూ.10 కూడా పేదవాళ్ల డబ్బే కదా. అలాగే ఆదాయం ఉండి కూడా పెన్షన్ తీసుకున్నా.. రైతు బంధు తీసుకున్నా.. బిచ్చమెత్తుకున్నట్లే. రేషన్ దగ్గర కక్కుర్తి పడేవాళ్ళు శవాల మీద పేలాలు ఏరుకునే వాళ్ళు. తినటానికి తిండి లేకుంటే ఏరుకున్నట్లే.” అని కాటిపల్లి వ్యాఖ్యనించారు.
దీనితో ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ.. అవి వారిని విమర్శించే దిశగా ఉన్నాయని.. పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు. అలాగే మరి కొంతమంది ఈ వ్యాఖ్యలకు సపోర్ట్ చేస్తూ.. ‘బాగా చెప్పారు ఎమ్మెల్యే గారు’ అంటూ కామెంట్ చేశారు. ఇంకొంతమంది ‘నెలకు రెండున్నర లక్షలుపైగా సాలరీ తీసుకుంటూ.. ప్రభుత్వ వాహనం వాడటమంటే.. అది కూడా సేమ్’ అని ఇలా రకరకాలుగా వారి భావాలను కామెంట్స్ రూపంలో వ్యక్తపరుస్తున్నారు. మొత్తానికి వెంకటరమణా రెడ్డి చేసిన వ్యాఖ్యలతో నెట్టింట కామెంట్లలో ఓ మినీ వార్ నడుస్తోంది. మరి, ఫ్రీ బస్సు ప్రయాణం విషయమై బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.