Dharani
Paris Olympics 2024-BJP MLA Shreyasi Singh: ఎంతో ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్స్‌లో సత్తా చాటేందుకు భారత్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఒకరు రంగంలోకి దిగారు. ఆ వివరాలు...
Paris Olympics 2024-BJP MLA Shreyasi Singh: ఎంతో ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్స్‌లో సత్తా చాటేందుకు భారత్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఒకరు రంగంలోకి దిగారు. ఆ వివరాలు...
Dharani
క్రీడాప్రపంచంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ ఏది అంటే.. ఒలింపిక్స్. నాలుగేళ్లకు ఒకసారి నిర్వహించే ఈ వేడుకలో ప్రపంచ దేశాలన్ని పాల్గొంటాయి. ఆయా దేశాల నుంచి వేలాది మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొని.. సత్తా చాటాలనుకుంటారు. చిన్న చిన్న దేశాల నుంచి కూడా ఎంతో ప్రతిభావంతమైన క్రీడాకారులు.. ఒలింపిక్స్‌లో సత్తా చాటుతుంటారు. ఇక ఈ ఏడాది ఒలింపిక్స్.. పారిస్ వేదికగా జరుగుతున్నాయి. జూలై 26 అనగా నేటి నుంచి ఈ క్రీడోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 11 వరకు ఒలింపిక్స్ జరగనున్నాయి. ఈ ఏడాది ఒలింపిక్స్.. ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా జరగున్నాయి.
ఇక పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. గత ఒలింపిక్స్ అనగా.. 2020, టోక్యోలో నిర్వహించిన ఒలింపిక్స్‌లో భారత్ ఏడు పతకాలు సాధించింది. ఇప్పుడు ఆ మెడల్స్ సంఖ్యను రెట్టింపు చేయడమే లక్ష్యంగా భారత అథ్లెట్ల బృందం.. పారిస్‌లో అడుగుపెట్టింది. ఇలా వెళ్లిన వారిలో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ఉన్నారు. ఇంతకు ఆమె ఎవరు.. ఏ క్రీడాంశంలో సత్తా చాటడానికి వెళ్లారు అనే వివరాలు మీమ కోసం…
ఈ ఏడాది పారిస్‌లో జరగుతున్న ఒలింపిక్స్‌లో సత్తా చాటడానికి భారత్ తరఫు నుంచి సుమారు 117 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. వీరిలో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ఉన్నారు. ఆమె షాట్‌గన్ ట్రాప్ ఉమెన్స్ ఈవెంట్‌లో పాల్గొనే షూటర్ శ్రేయాసి సింగ్. బీజేపీ ఎమ్మెల్యే అయిన శ్రేయాసి సింగ్.. ఈ పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్నారు. శ్రేయసి సింగ్ బిహార్‌లోని జముయ్ అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీకి చెందిన విజయ్ ప్రకాష్‌పై శ్రేయాసి సింగ్ దాదాపు 41 వేల ఓట్లతో మెజారిటీతో విజయం సాధించారు.
శ్రేయసి సింగ్ వ్యక్తిగత వివరాల విషయానికి వస్తే.. ఆమె బిహార్ మాజీ ఎంపీ దిగ్విజయ్ సింగ్ కుమార్తె. శ్రేయసి తల్లి పుతుల్ సింగ్ కూడా బంకా స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరు రాజకీయాల్లో రాణించడంతో.. ఆమె కూడా అదే వారసత్వాన్ని అందిపుచ్చుంది. ఇటు రాజకీయాల్లో రాణిస్తూనే.. క్రీడల్లో కూడా సత్తా చాటుతుంది. ఇక 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో డబుల్ ట్రాప్ షూటింగ్ ఈవెంట్‌లో శ్రేయాసి సింగ్ రజత పతకాన్ని గెలుచుకున్నారు. ఆ తర్వాత 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా శ్రేయసి అద్భుత ప్రదర్శన చేసి దేశానికి బంగారు పతకాన్ని సాధించిపెట్టారు. క్రీడలకు ఆమె చేసిన సేవలను దృష్టిలో ఉంచుకునీ, 32 ఏళ్ల శ్రేయసి సింగ్‌కు 2018 సంవత్సరంలో ప్రభుత్వం అర్జున అవార్డు బహుకరించింది. ఇప్పుడు ఆమె భారత్ కు మెడల్ అందించమే లక్ష్యంగా పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొంటున్నారు.