Dharani
Free Bus Service: తెలంగాణ మహాలక్ష్ములకు ఆర్టీసీ సంస్థ బ్యాడ్ న్యూస్ చెప్పడానికి రెడీ అవుతోంది. ఇకపై వారంతా బస్సుల్లో టికెట్ తీసుకోవాల్సిందే చెబుతున్నారు. ఆ వివరాలు..
Free Bus Service: తెలంగాణ మహాలక్ష్ములకు ఆర్టీసీ సంస్థ బ్యాడ్ న్యూస్ చెప్పడానికి రెడీ అవుతోంది. ఇకపై వారంతా బస్సుల్లో టికెట్ తీసుకోవాల్సిందే చెబుతున్నారు. ఆ వివరాలు..
Dharani
తెలంగాణలో అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికల వేళ చెప్పినట్లుగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ కల్పిస్తోంది. ఇక ఈ పథకం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిది. ఉచిత ప్రయాణం కల్పించడంతో.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య భారీగా పెరగడంతో.. రద్దీ పెరిగింది.. ఆదాయం కూడా పెరిగింది. అయితే దీని వల్ల మగవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సుల్లో సీట్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన రద్దీని తట్టుకునే విధంగా బస్సుల సంఖ్య పెంచాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. ఇక ఉచిత బస్సు ప్రయాణం వల్ల డీలక్స్ బస్సుల్లో ప్రయాణం చేసే మహిళల సంఖ్య తగ్గుతోంది. అలానే ఎక్స్‌ప్రెస్, ఆర్డీనరి బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరుగుతోంది. ఈక్రమంలో తాజాగా ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఇకపై వారంతా టికెట్ తీసుకోవాల్సిన పరిస్థితి రానుంది. ఆ వివరాలు. .
రాష్ట్రంలో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు వీలున్న ఎక్స్‌ప్రెస్ బస్సులను రద్దీకి తగ్గట్టుగా పెంచడంపై ఆర్టీసీ సంస్థ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. పైగా ఉచిత ప్రయాణం అమల్లోకి రావడంతో.. డీలక్స్ బస్సుల్లో ప్రయాణం చేసే వారి సంఖ్య తగ్గుతోంది. దాంతో మహిళా ప్రయాణికులను డీలక్స్ బస్సులవైపు వారిని మళ్లించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే డీలక్స్ బస్సు ఎక్కితే మహిళలకు బహుమతులు ఇస్తామంటూ ఆర్టీసీ కొత్త స్కీంను ప్రారంభించింది. దీనిలో భాగంగా హనుమకొండ-హైదరాబాద్ మార్గంలో జనగామ డిపో 3 డీలక్స్ బస్సులను ప్రవేశపెట్టింది. ఈ బస్సుల్లో ప్రయాణిస్తే ప్రతి 15 రోజులకు ముగ్గురు మహిళలకు గిఫ్ట్‌లు ఇస్తామని ప్రకటించింది.
ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చిన తర్వాత.. ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ వంద శాతం నమోదవుతోంది. కేవలం ఎక్స్‌ప్రెస్ బస్సులనే పరిగణనలోకి తీసుకుంటే అది 120 శాతం దాటుతోంది. ఆర్డినరీ బస్సుల్లో కంటే ఎక్స్‌ప్రెస్‌లో సీట్లు కొంత మెరుగ్గా ఉంటాయి. పైగా బస్సు వేగం కూడా అధికం. ఆగే స్టాపులు, ప్రయాణానికి సమయం కూడా తక్కువ పడుతుంది. ఈ కారణంగానే మహిళలు ఎక్కువగా ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ అంశం ఆర్టీసీకి ఆర్థికంగా సమస్యగా మారింది. రోజువారీ నిర్వహణ ఖర్చులు, డీజిల్, ఉద్యోగులకు నెల జీతాలకు ఇబ్బంది అవుతోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ మార్పులు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఎక్స్‌ప్రెస్సుల్లో రద్దీ తగ్గించి.. డీలక్స్‌లో ప్రయాణించేలా చేయడం కోసం స్కీమ్‌లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. దీనికి తగ్గట్టుగానే ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సులను తగ్గించి.. డీలక్స్‌ల సంఖ్యను పెంచితే అప్పుడు మహిళలు కచ్చితంగా టికెట్ తీసుకోవాల్సి వస్తుంది.
ఎ‍్స్‌ప్రెస్ బస్సుల్లో రద్దీ పెరగడంతో.. దూర ప్రాంత సర్వీసుల్ని రద్దు చేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారుల నుంచి డిపో మేనేజర్లకు కొంతకాలం క్రితమే అంతర్గత ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పలు అంతర్ జిల్లా, అంతర్రాష్ట్ర సర్వీసులను రద్దు చేశారు. జనగామ నుంచి బాసర మార్గంలో 30 ఏళ్లుగా ఎక్స్‌ప్రెస్ బస్సుంది. ఉచిత ప్రయాణ పథకం వచ్చిన తర్వాత బస్సులో రద్దీ విపరీతంగా పెరిగింది. దాంతో ఫిబ్రవరి మాసంలో జనగామ డిపో ఈ సర్వీసును రద్దు చేసింది. కరీంనగర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావుపేటకు సూర్యాపేట, మిర్యాలగూడ మీదుగా ఎక్స్‌ప్రెస్ ఉండేది. ఈ బస్‌ను రద్దు చేశారు. ప్రయాణికుల ఒత్తిడి పెరగడంతో ఇటీవల పునరుద్ధరించారు. ఈ క్రమంలో ఆయా మార్గాల్లో ఎక్స్‌ప్రెస్ బస్సుల స్థానంలో.. డీలక్స్‌లను తీసుకురావాలని భావిస్తోంది అంటున్నారు.