iDreamPost
android-app
ios-app

BJP లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. తెలంగాణలో అవకాశం దక్కింది వీరికే

బీజేపీ పార్టీ లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. 195 స్థానాలకు తొలి జాబితాను రిలీజ్ చేసింది. ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రం నుంచి సీట్లు పొందిన అభ్యర్థులు ఎవరంటే?

బీజేపీ పార్టీ లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. 195 స్థానాలకు తొలి జాబితాను రిలీజ్ చేసింది. ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రం నుంచి సీట్లు పొందిన అభ్యర్థులు ఎవరంటే?

BJP లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. తెలంగాణలో అవకాశం దక్కింది వీరికే

మరికొన్ని నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ రానున్నాయి. ఇందుకోసం ప్రధాన రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ముచ్చటగా మూడోసారి అధికారం చేజిక్కించుకునేందుకు భారతీయ జనతా పార్టీ ప్లాన్ చేస్తుంటే, మరో వైపు కాంగ్రెస్ పార్టీ పలు ప్రాంతీయ పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వంతో అధికారంలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ 195 లోక్‌సభ స్థానాలకు తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ నుంచి తొమ్మిది మందికి సీట్లను కేటాయించింది బీజేపీ అధిష్టానం.

అవకాశం దక్కిన వారిలో కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్, జహీరాబాద్ నుంచి బీబీపాటిల్, మల్కాజ్ గిరి స్థానం నుంచి ఈటెల రాజేందర్, సికింద్రా బాద్ నుంచి కిషన్ రెడ్డి, హైదరాబాద్ నుంచి మాధవీలత, చేవేళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి భరత్, భూవనగిరి పార్లమెంట్ స్థానం నుంచి బూరనర్సయ్యగౌడ్ ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వారణాసి నుంచి పోటీ చేయనున్నారు. ఇక హోంమంత్రి అమిత్ షా గాంధీ నగర్ నుంచి పోటీ పడనున్నారు.

కమలం పార్టీ రాష్ట్రాలవారీగా విడుదల చేసిన సీట్లు.. బంగాల్‌- 27, మధ్యప్రదేశ్‌- 24, గుజరాత్‌- 15, రాజస్థాన్‌- 15, కేరళ- 12, తెలంగాణ- 9, ఝార్ఖండ్‌- 11, ఛత్తీస్‌గడ్‌- 12, దిల్లీ- 5, జమ్మూకశ్మీర్‌- 2, ఉత్తరాఖండ్‌- 3, అరుణాచల్‌ ప్రదేశ్‌- 2, గోవా- 1, త్రిపుర- 1, అండమాన్‌ నికోబార్‌- 1, దమన్‌ అండ్‌ దీవ్‌- 1 అభ్యర్థులను పోటీలో నిలిపింది. ఈ జాబితాలో ఏపీ నుంచి ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేదు బీజేపీ. లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ ప్రధాన కార్యదర్శి జాబితాను ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో 400 సీట్లే లక్ష్యంగా పని చేయనున్నట్లు వినోద్‌ తావ్‌డే పేర్కొన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి