P Venkatesh
మీరు వంటలు బాగా చేస్తారా? బిర్యానీ వండడంలో మీకు ఎవరూ సాటిరారా? అయితే మీరు లక్షల్లో సంపాదించొచ్చు. హైదరాబాద్ లో బిర్యానీ వంట మాస్టర్ కావాలంటూ ఓ పోస్టు వైరల్ గా మారింది. నెలకు జీతం రూ. 75 వేలు.
మీరు వంటలు బాగా చేస్తారా? బిర్యానీ వండడంలో మీకు ఎవరూ సాటిరారా? అయితే మీరు లక్షల్లో సంపాదించొచ్చు. హైదరాబాద్ లో బిర్యానీ వంట మాస్టర్ కావాలంటూ ఓ పోస్టు వైరల్ గా మారింది. నెలకు జీతం రూ. 75 వేలు.
P Venkatesh
జీవితంలో చదువు చాలా ముఖ్యం. ఒక వ్యక్తి ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లేది ఒక్క విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. పేదరికాన్ని పారద్రోలి జీవితాల్లో వెలుగులు నింపేది చదువు ఒక్కటే. అయితే ప్రస్తుత రోజుల్లో డిగ్రీలు, పీజీలు చేసినా ఉద్యోగాలు సాధించడం కష్టంగా మారింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో విపరీతమైన కాంపిటీషన్ నెలకొంది. దీంతో చదువుకొని తప్పు చేశామా? అనే నిరాశకు లోనవుతున్నారు. ఎందుకంటే చదువు లేకుండా కూడా చాలా మంది లక్షల్లో సంపాదిస్తున్నారు. మరి మీరు కూడా ఇలా లక్షల్లో సంపాదించాలనుకుంటున్నారా? అయితే హైదరాబాద్ లో ఓ రెస్టారెంట్ లో బిర్యానీ వంట మాస్టర్ కావాలంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతోంది. నెలకు 75 వేల జీతం ఇస్తారట.
హైదరాబాద్ బిర్యానికి వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఉంటారు. ఒక్కసారైన హైదరాబాద్ బిర్యానీ రుచి చూడాలని తహతహలాడుతుంటారు. బిర్యానీ రుచిగా రావాలంటే వంట మాస్టర్ చేతుల్లో ఉంటుంది. మరి మీరు కూడా మంచి వంట మాస్టరా? అయితే మీకు ఓ బంపరాఫర్ ఉంది. ఏ చదువు లేకపోయినా సరే మీరు వండర్ ఫుల్ గా బిర్యాని వండితే చాలు. కళ్లు చెదిరే జీతాన్ని సొంతం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో ఓ యూజర్ బిర్యానీ మాస్టర్ చెఫ్ కావాలంటూ పోస్టు చేశాడు. ఆ వీడియోలో.. హైదరాబాద్ లోని మల్లాపూర్, నాచారం ఏరియాలో ఓ రెస్టారెంట్ లో బిర్యానీ వంట మాస్టర్ కావాలంటూ కోరారు. రోజుకు 10 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. ఆయన కేవలం బిర్యానీ చేస్తే చాలు. ఇతడికి సహాయంగా పాత్రలు కడగడానికి, కూరగాయలు కట్ చేయడానికి అసిస్టెంట్ లను కూడా ఇస్తారు.
అయితే బిర్యానీ కుక్ కు ఓ కండీషన్ పెట్టారు. చెఫ్ కు పాన్ గుట్కా తినే అలవాటు ఉండకూడదు. ఇక ఈ బిర్యానీ చెఫ్ కు ఇచ్చే శాలరీ ఎంతో తెలుసా? రోజుకు రూ. 2500 అంటే నెలకు రూ. 75 వేలు. అంటే ఏడాదికి రూ. 9 లక్షల జీతం అన్నమాట. బిర్యాని చెఫ్ కు చదువుతో సంబంధం లేకుండా లక్షల్లో జీతం వస్తుండడంతో చదువుకున్న నిరుద్యోగులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. డిగ్రీలు, పీజీలు చేసి వేస్ట్ అంటూ ఉసూరుమంటున్నారు. చదువుకోకుండా వంట మాస్టర్ అయినా కూడా లక్షల్లో సంపాదించుకునే వాళ్లమని తెగ బాధపడిపోతున్నారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు.