HYDలో ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పేరుతో కొత్త మోసం! మహిళలు జాగ్రత్త!

HYDలో ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పేరుతో కొత్త మోసం! మహిళలు జాగ్రత్త!

ఈరోజుల్లో ఫ్రీగా ఏ వస్తువు వచ్చినా దానిని వదులుకోవడానికి ప్రజలు అస్సలు సంకోచించారు. అయితే ఇలా ప్రజల అవసరాలనే ఆసరాగా చేసుకుంటున్న కొంతమంది కేటుగాళ్లు సోషల్ మీడియా వేదికగా రకరకాల సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. కాగా, ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ద్వారా ఎన్నో తరహా మోసాలకు పాల్పడిన కేటుగాళ్లు తాజాగా ఇప్పుడు ఉచిత గ్యాస్ సిలెండర్స్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. కనుక అప్రమాత్తంగా ఉండకపోతే డేంజర్ లో పడినట్లే. మరి ఆ వివరాలేంటో చూద్దాం.

ఈరోజుల్లో ఫ్రీగా ఏ వస్తువు వచ్చినా దానిని వదులుకోవడానికి ప్రజలు అస్సలు సంకోచించారు. అయితే ఇలా ప్రజల అవసరాలనే ఆసరాగా చేసుకుంటున్న కొంతమంది కేటుగాళ్లు సోషల్ మీడియా వేదికగా రకరకాల సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. కాగా, ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ద్వారా ఎన్నో తరహా మోసాలకు పాల్పడిన కేటుగాళ్లు తాజాగా ఇప్పుడు ఉచిత గ్యాస్ సిలెండర్స్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. కనుక అప్రమాత్తంగా ఉండకపోతే డేంజర్ లో పడినట్లే. మరి ఆ వివరాలేంటో చూద్దాం.

ప్రస్తుత సమాజంలో ఈజీగా డబ్బులను సంపాదించాలనే నేపథ్యంలో చాలామంది కేటుగాళ్లు సామన్య ప్రజలకు అడుగడుగునా బురీడి కొట్టిస్తున్నారు. ఈ మోసాలకు పునాదిగా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ను ఉపాయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే.. రకరకాల దందాలు,స్కామ్స్ చేస్తూ అమాయకపు ప్రజలను వలలో వేసుకొని భారీగా మోసం చేస్తున్నారు.అయితే ఈ తరహా ఆన్ లైన్ మోసాలు అనేవి ఏ స్థాయిలో జరుగుతున్నాయో ఊహాకు కూడా అందడం లేదు. ఎందుకంటే.. కొంతమంది కేటుగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను ఎంచుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఎన్నో తరహా మోసాలను చూసి ఉంటాం. కానీ, తాజాగా గ్యాస్ సిలిండర్స్ పేరిట కూడా నగరంలో కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పైగా ఈ విషయాన్ని స్వయంగా భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (బిజిఎల్) సంస్థ తమ కస్టమర్లను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఈరోజుల్లో ఫ్రీగా వస్తే  ఫినాయిల్ కూడా చాలామంది వదులుకోరు. అలాంటిది ఉచితంగా ఏదైనా విలువైనా వస్తువు వస్తుందంటే.. వదులకోవడానికి అస్సలు సంకోచించారు. ముఖ్యంగా  ఈ విషయంలో మహిళలు అయితే కుటుంబ అవసరాల కోసం ముందస్తుగా ఆలోచిస్తుంటారు. అయితే ఇలా ప్రజల అవసరాలనే ఆసరాగా చేసుకుంటున్న కొంతమంది కేటుగాళ్లు సోషల్ మీడియా వేదికగా రకరకాల సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. లేనిపోని ప్రకటనలతో ప్రజలకు ఆశ కల్పించి, వారి ఆశనే వలలా వేసుకొని భారీగా మోసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కొంతమంది  నేరగాళ్లు ఉచిత గ్యాస్ సిలెండర్స్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారనే విషయం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక ఈ విషయాన్ని స్వయంగా రెండు తెలుగు రాష్ట్రాలలో గ్యాస్ సరఫరా చేసే భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (బిజిఎల్) సంస్థ పేర్కొంది. అంతేకాకుండా.. తమ కస్టమర్లకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించి సర్క్యులర్ జారీ చేసింది.

ఇక జారీ చేసిన సర్క్యులర్ లో వాట్సాప్ ద్వారా నకిలీ APK ఫైల్‌ను ఇన్ స్టాల్ చేయించి.. కస్టమర్ల సున్నితమైన సమాచారాన్ని దొంగిలించడానికి యత్నిస్తున్నారని కంపెనీ తెలిపింది. ఇక ఈ మోసగాళ్ల మాయాలో ఇప్పటికే ఒక వినియోగదారుడు బ్బు చెల్లించాడని భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ పేర్కొంది. అంతేకాకుండా.. కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలని, అనధికారిక యాప్ (APK) ఫైళ్లను డౌన్‌లోడ్ చేయకుండా ఉండమని కోరుతున్నాం.. అని BGL ప్రకటన చేసింది.

అలాగే భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్న నేరగాళ్లు ఈ  9940364176 (వాట్సాప్), 9390958942 (మొబైల్) నంబర్లను వినియోగిస్తున్నారని కంపెనీ తెలిపింది. కనుక ఈ నంబర్ల నుంచి వచ్చే సందేశాలు, కాల్స్‌కు ప్రజలు స్పందించవద్దని సూచించింది. అలాగే BGL పేరుతో తెలియని నంబర్ల నుంచి వచ్చిన సందేశాలు, WhatsApp కమ్యూనికేషన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరింది. దాంతో పాటు OTPలు, పాస్‌వర్డ్‌లు , వ్యక్తిగత సమాచారాన్ని కూడా షేర్ చేయవద్దని హెచ్చరించింది. ఇక కేవలం www.bglgas.com వెబ్‌సైట్‌లో అందించిన అధికారిక నంబర్‌ను మాత్రమే ఉపయోగించాలని తమ కస్టమర్లను  కోరింది. మరి, ఉచిత గ్యాస్ సిలెండర్స్ పేరుతో నగరంలో జరుగుతున్న ఈ రకపు మోసం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments