గురుకుల హాస్టల్లో బీరు సీసాలు.. ప్రిన్సిపాల్ వేధిస్తోందంటూ విద్యార్థినులు నిరసన!

Beer Bottles found In Suryapet ladies residential Hostel: బుద్ధులు నేర్పాల్సిన గురువు బుద్ధి తక్కువ పనులు చేస్తోంది అంటూ విద్యార్థినులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. ప్రిన్సిపాల్ హాస్టల్ లో బీరు తాగుతూ.. తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు.

Beer Bottles found In Suryapet ladies residential Hostel: బుద్ధులు నేర్పాల్సిన గురువు బుద్ధి తక్కువ పనులు చేస్తోంది అంటూ విద్యార్థినులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. ప్రిన్సిపాల్ హాస్టల్ లో బీరు తాగుతూ.. తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు.

గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అంటారు. అంటే గురు దైవంతో సమానం. మన సంస్కృతిలో గురువును దేవుడి కంటే గొప్పగా చూస్తాం. కానీ, ఇలాంటి కొంత మంది టీచర్స్ వల్ల ఆ పేరుకు, ఆ వృత్తికే కళంకం వస్తోంది. కాలేజ్ మొత్తానికి ఆదర్శంగా ఉండాల్సిన ప్రిన్సిపాల్ తప్పుడు పనులు చేస్తోందంటూ విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. గురుకుల పాఠశాల హాస్టల్లో మద్యం తాగుతూ తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అంటూ విద్యార్థులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. తమ ప్రిన్సిపాల్, కేర్ టేకర్ పై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. తమను మానసికంగా వేధిస్తోందని వాపోయారు.

విద్య చెప్పాల్సిన ప్రిన్సిపాల్ దారి తప్పి ప్రవర్తిస్తోంది అంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్ల బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శైలజ, కేర్ టేకర్ పై విద్యార్థులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. హాస్టల్ లో రాత్రిపూట బీర్లు తాగుతున్నట్లు ఆరోపించారు. అంతేకాకుండా.. హాస్టల్ గదిలో ఉన్న బీరు సీసాలను మీడియాకి చూపించారు. ఇదేంటని ప్రశ్నిస్తే డిగ్రీ విద్యార్థులని కూడా చూడకుండా కొడుతోందని వాపోయారు. ఆమె నుంచి తమకు రక్షణ లేదంటూ ఆరోపిస్తున్నారు. రాత్రిపూట మద్యం తాగితే క్యాంపస్ లోఒక్కరు కూడా నిద్రపోలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

అమ్మాయిల మీడియాతో మాట్లాడారు. ప్రిన్సిపాల్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మేము చిన్న పిల్లలం కాదు. మమ్మల్ని కొడుతున్నారు. అసలు మమ్మల్ని కొట్టడం ఏంటి? మేము మేజర్లం. మా తల్లిదండ్రులను కూడా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అసభ్య పదజాలం వాడుతూ మానసికంగా హింసిస్తున్నారు అంటూ ఆరోపిస్తున్నారు. అంతేకాకుడా.. అమ్మాయిల హాస్టల్ కు ప్రిన్సిపాల్ కొడుకు వచ్చి వారం రోజులు ఉన్నాడని చెప్పారు. అతను ఉంటే తాము ఎంతో ఇబ్బంది పడ్డామని చెప్పారు. ఆమె కుమారుడు వస్తే ఎవరూ బయటకు రాకూడదని ఆర్డర్ వేశారని తెలిపారు. అసలు ఆ అబ్బాయి వచ్చి హాస్టల్ లో ఎలా ఉంటాడు అంటూ ప్రశ్నించారు. మద్యం తాగుతూ.. ఆ మత్తులో తమని ఏం చేస్తారో అని భయపడుతున్నట్లు వ్యాఖ్యానించారు. ప్రిన్సిపాల్ శైలజను ఏసీటీని కూడా విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆ ప్రిన్సిపాల్ మాత్రం తమకు వద్దు అని తేల్చేశారు.

Show comments